Goddess lakshmi devi blessings: మీ ఇంటిని ఇలా సర్దుకున్నారంటే.. లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది-vastu tips for wealth and success follow these tips to enchance good luck and goddess lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Goddess Lakshmi Devi Blessings: మీ ఇంటిని ఇలా సర్దుకున్నారంటే.. లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది

Goddess lakshmi devi blessings: మీ ఇంటిని ఇలా సర్దుకున్నారంటే.. లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది

Gunti Soundarya HT Telugu
May 20, 2024 11:06 AM IST

Goddess lakshmi devi blessings: ఇంటి ఆనందం, శ్రేయస్సు, సంపద కోసం ఈ వాస్తు చిట్కాలు పాటిస్తూ మీ ఇంటికి సర్దుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు.

లక్ష్మీదేవి అనుగ్రహం పొందే వాస్తు నియమాలు
లక్ష్మీదేవి అనుగ్రహం పొందే వాస్తు నియమాలు (pixabay)

Goddess lakshmi devi blessings: హిందూ మతంలో వాస్తు నియమాలను పాటించడం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. వాస్తు ప్రకారం కొన్ని విషయాల జాగ్రత్తగా చూసుకోవడం వల్ల జీవితంలో సానుకూల శక్తి ప్రసరిస్తుందని నమ్ముతారు. 

సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో ఆనందం, శాంతి ఉంటాయి. ఇంటి సభ్యులకు విజయపథంలో ఆటంకాలు ఎదురుకావు. జీవితంలో దేనికి లోటు ఉండదు. వాస్తు ప్రకారం సంపద, శ్రేయస్సు, సంతోషకరమైన జీవితం కోసం ఈ నియమాలు పాటించాలి. ఈ మూడు దిశల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

వాస్తు ప్రకారం ఉత్తర దిక్కుని కుబేరుడి ప్రదేశంగా భావిస్తారు. ఇక ఆగ్నేయ దిశను సంపద ప్రవాహానికి దిక్కుగా భావిస్తారు. ఇంటి ఈశాన్యం మూల సంపద సంతోషం శ్రేయస్సుకు దిక్కు అని చెప్తారు. తరచూ డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేవారు ఈ దిశలో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 

ఇంటి ఉత్తర దిశ

వాస్తు ప్రకారం బుధ గ్రహం ప్రభావం ఇంటి ఉత్తర దిశలో ఉంటుంది. ఈ దిశలో ఆకుపచ్చ రంగును ఎక్కువగా ఉపయోగించడం వల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. ఈ దిశలో మనీ ప్లాంట్ లేదా వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తర దిశలో సానుకూల శక్తి మరింత ప్రసరించేలా చేసేందుకు మీరు అద్దం లేదా బుధ యంత్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. దీనివల్ల డబ్బు కొరత తొలగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తర దిక్కును పరిశుభ్రంగా ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. 

ఇంటి ఆగ్నేయ దిశ

వాస్తు ప్రకారం ఇంటి ఆగ్నేయ దిశను శుక్ర భగవానుడి స్థానంగా భావిస్తారు. ఈ దిశలో ఎరుపు రంగు ఎక్కువగా ఉపయోగించాలి. అలాగే ఈ దిశలో శుక్ర యంత్రాన్ని ప్రతిష్టించడం వల్ల ఇంట్లో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. సంపద పెరిగే అవకాశాలు రెట్టింపు అవుతాయి.

ఇంటి ఈశాన్య దిశ

వాస్తులో ఈశాన్యం మూలను దేవ గురువు బృహస్పతి స్థానంగా భావిస్తారు. ఈ దిశలో పనులు క్రమ పద్ధతిలో జరగాలి. పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సంపద, ఆనందం, అదృష్టాన్ని పెంచేందుకు మీరు ఈ దిశలో అద్దం ఉంచవచ్చు లేదా గురువు యంత్రాన్ని ప్రతిష్టించవచ్చు.

పూజ గదిలో డబ్బులు వద్దు

వాస్తు ప్రకారం పూజ గదిలో సంపదను ఎప్పుడూ కూడబెట్టకూడదు. ఇలా చేయడం వల్ల వ్యక్తి దృష్టి భగవంతుడి మీద కంటే మనసు ధనం మీదే ఎక్కువగా నిమగ్నమై ఉంటుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇలాంటి విగ్రహమే ఉండాలి

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా కార్యాలయంలో ఎప్పుడూ లక్ష్మీదేవి కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనితోపాటు రెండు వైపులా రెండు ఏనుగులు తొండంపైకి లేపి ఉన్నట్లుగా ప్రతిమలు ఉంచుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల డబ్బుకు కొదవ ఉండదని నమ్ముతారు. 

ఈ చెట్లు వద్దు

వాస్తు ప్రకారం ప్లాస్టిక్, ముళ్ళ చెట్లు పొరపాటున కూడా ఇంటి లోపల ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాపిస్తుంది. మీకు మొక్కలు పెట్టుకోవాలని ఆశ ఉన్నట్లయితే సంపదని ఇచ్చే మనీ ప్లాంట్, జేడే ప్లాంట్, కాయిన్ ప్లాంట్, లక్కీ వెదురు వంటివి ఇంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు. 

 

Whats_app_banner