Vaishakha pournami 2024: వైశాఖ పౌర్ణమి రోజు ఇవి దానం చేయండి.. లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు దోషాలు తొలగుతాయ్-do these remedies on vaishakha pournami 2024 you will get goddess lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vaishakha Pournami 2024: వైశాఖ పౌర్ణమి రోజు ఇవి దానం చేయండి.. లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు దోషాలు తొలగుతాయ్

Vaishakha pournami 2024: వైశాఖ పౌర్ణమి రోజు ఇవి దానం చేయండి.. లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు దోషాలు తొలగుతాయ్

Gunti Soundarya HT Telugu
May 16, 2024 06:56 PM IST

Vaishakha pournami 2024: లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు వైశాఖ పౌర్ణమి చాలా మంచి రోజు. ఈరోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు దోషాలు తొలగిపోతాయి.

వైశాఖ పౌర్ణమి రోజు దానం చేయాల్సిన వస్తువులు ఇవే
వైశాఖ పౌర్ణమి రోజు దానం చేయాల్సిన వస్తువులు ఇవే (pixabay)

Vaishakha pournami 2024: హిందూ మతంలో పౌర్ణమి తిథి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈరోజు పూజలు, దానాలు చేయడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయని నమ్ముతారు.

వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు. ఈరోజున ఉపవాసం ఆచరించి పుణ్య స్నానాలు చేయడం, దానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈరోజు ప్రత్యేక వస్తువులను దానం చేసే సంప్రదాయం ఉంది. ఈ రోజున కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల వ్యక్తి అన్నింటా విజయం పొందుతాడు. ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతాడని నమ్ముతారు.

వైశాఖ పౌర్ణమి ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ పౌర్ణమి తిథి మే 22 సాయంత్రం 6:47 గంటలకు ప్రారంభం అవుతుంది. మే 23వ తేదీ సాయంత్రం 7. 22 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి కారణంగా మే 24న వైశాఖ పౌర్ణమి జరుపుకుంటారు. ఈరోజున సర్వార్థి కూడా ఏర్పడుతుంది. ఈరోజు గజకేసరి యోగం కూడా ఉండనుంది. వైశాఖ పౌర్ణమి రోజు తీసుకునే కొన్ని చర్యలు మీ జీవితంలోని ఇబ్బందులను తొలగించి సంతోషాన్ని, శాంతిని కలిగిస్తాయి. అవి ఏంటో చూద్దాం.

ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు

వైశాఖ పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి 11 పసుపు కౌరీలు సమర్పించాలి. వీటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచుకోవాలి. ఇది ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. ఇలా చేస్తే కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది.

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం

పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన ఖీర్ నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఖీర్ సమర్పించి దాన్ని కుటుంబ సభ్యులు ప్రసాదంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది.

చీపురు దానం చేయాలి

ఆర్థిక లాభాల కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం వైశాఖ పౌర్ణమి రోజున చీపురు దానం చేయాలి. కొన్ని విశ్వాసాల ప్రకారం చీపురు విరాళంగా ఇవ్వటం వల్ల ఆర్థిక లాభం పొందే బలమైన అవకాశాలు ఏర్పడతాయి. తల్లి ఆశీస్సులు లభిస్తాయి.

సమస్యలు తొలగించుకునేందుకు

వైశాఖ పౌర్ణమి రోజు గంగా వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల జీవితంలోనే కష్టాలన్నీ తొలగిపోతాయి. పవిత్ర నదిలో స్నానం చేయడం, దానం చేయడం వల్ల జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతోషం శాంతి లభిస్తాయి. ఇది కాకుండా ఈ సమయంలో వేసవికాలం గరిష్టంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో సత్తు, నీరు మొదలైన వాటిని దానం చేయాలి. ఈ మాసంలో తాగునీరు అందించడం వల్ల పితృ దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.

ఉద్యోగంలో సమస్యలు పోగొట్టుకునేందుకు

కష్టపడి పనిచేసిన విజయం లభించకపోతే ఈరోజు నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల వ్యక్తి కోరుకున్న ఫలితాలు పొందుతాడు. ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం రాదు.

చంద్రుడిని పూజించాలి

వైశాఖ పౌర్ణమి రోజు చంద్రుడిని పూజించడం వల్ల చంద్ర దోషం నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి.

Whats_app_banner