Gajakesari yogam: గజకేసరి యోగంతో ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం.. ఊహించని ధనలాభం-moon jupiter conjunction in mesha rasi will create gaja kesari yogam these zodiac signs get lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gajakesari Yogam: గజకేసరి యోగంతో ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం.. ఊహించని ధనలాభం

Gajakesari yogam: గజకేసరి యోగంతో ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం.. ఊహించని ధనలాభం

Gunti Soundarya HT Telugu
Apr 10, 2024 08:00 AM IST

Gajakesari yogam: మేష రాశిలో గురు, చంద్రుడు కలిసి గజకేసరి యోగం ఏర్పరుస్తున్నారు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఊహించని ధనలాభం కలుగుతుంది.

మేషరాశిలో గజకేసరి యోగం
మేషరాశిలో గజకేసరి యోగం

Gajakesari yogam: మనసుకు కారకుడిగా భావించే చంద్రుడు ఏప్రిల్ 9 నుంచి మేష రాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ఒక రాశిలో రెండున్నర రోజుల పాటు సంచరిస్తాడు. అలా ఏప్రిల్ 11 వరకు ఈ రాశిలోనే ఉంటాడు.

మేష రాశిలో ఇప్పటికే ఇప్పటికే దేవగురువు బృహస్పతి కూడా ఉన్నాడు. మేష రాశిలో గురు, చంద్రులు కలిసి గజకేసరి రాజయోగం ఏర్పరుస్తున్నారు. మత విశ్వాసాల ప్రకారం జాతకంలో గజకేసరి రాజయోగం ఉంటే సంపద, ఆనందం, అదృష్టాన్ని పెంచుతుంది. జాతకులు ధన సమస్యల నుంచి బయటపడతారు. ఈ రాజయోగం ప్రభావంతో ఒక వ్యక్తి జ్ఞానవంతుడు, ధనవంతుడు అవుతాడు. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజకేసరి యోగం మేష రాశి వారితో పాటు మరికొన్ని రాశుల వారికి మేలు చేస్తుంది.

మేష రాశి

నవరాత్రులలో మేష రాశి జాతకులు అద్భుత మార్పులు చూస్తారు. గజకేసరి యోగం ఈ రాశిలోనే ఏర్పడుతుంది. ఫలితంగా మేష రాశి వారికి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటికంటే మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆకస్మిక, ఊహించని ధన లాభం పొందుతారు. వాహనం, ఆస్తి కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. జీవితంలో ప్రతి రంగంలో ప్రయోజనాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధిలో ఆర్థికంగా లాభపడతారు. ప్రారంభించిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 

సింహ రాశి

గజకేసరి యోగం ప్రభావంతో సింహ రాశి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆస్తి క్రయవిక్రయాల ద్వారా లాభాలు పొందుతారు. రాజకీయాలతో సంబంధం ఉన్నవారు ఏదైనా అధికార పదవిని పొందుతారు. ఇతరుల నుంచి గౌరవాన్ని పొందుతారు. శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా ట్రిప్ కి వెళతారు. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది.

తులా రాశి

గజకేసరి యోగం ప్రభావంతో చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతమవుతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. జీవితంలోని ప్రతి రంగంలో మీరు ఆశించిన విజయాన్ని పొందుతారు. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. తల్లిదండ్రులు అండగా ఉంటారు. విదేశాలకు వెళ్ళే యోగం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆస్తులు పెరుగుతాయి. 

ధనుస్సు రాశి

నవరాత్రులు, గజకేసరి యోగం ప్రభావంతో ధనుస్సు రాశి వారికి ఇవి ఎంతో శుభకరమైన రోజులు కాబోతున్నాయి. ఈ సమయంలో సౌకర్యాలు పెరుగుతాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు అద్భుతంగా రాణిస్తారు. ఫలితంగా ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. గౌరవం కూడా పెరుగుతుంది. కార్యాలయంలో పదోన్నతికి అవకాశాలు పెరుగుతాయి. వృత్తిలో చాలా పురోగతి సాధిస్తారు. నిలిచిపోయిన పని పూర్తి చేస్తారు. పదోన్నతి, జీతం పెరుగుదల ఉంటుంది. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందుతారు. కష్ట సమయంలో కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారు.

 

WhatsApp channel