Jupiter nakshatra transit: నక్షత్రం మారబోతున్న బృహస్పతి.. ఈ మూడు రాశులకు మంచి రోజులు రాబోతున్నాయి-jupiter enter into krutika nakshatrm these zodiac signs starts best time ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jupiter Nakshatra Transit: నక్షత్రం మారబోతున్న బృహస్పతి.. ఈ మూడు రాశులకు మంచి రోజులు రాబోతున్నాయి

Jupiter nakshatra transit: నక్షత్రం మారబోతున్న బృహస్పతి.. ఈ మూడు రాశులకు మంచి రోజులు రాబోతున్నాయి

Gunti Soundarya HT Telugu
Apr 05, 2024 10:59 AM IST

Jupiter nakshatra transit: బృహస్పతి త్వరలో నక్షత్రం మార్చుకోబోతున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారికి అదృష్టం రెట్టింపు కాబోతుంది. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

బృహస్పతి నక్షత్ర మార్పు
బృహస్పతి నక్షత్ర మార్పు

Jupiter nakshatra transit: జ్ఞానం, సంపద, ఆధ్యాత్మికతకు ప్రతీకగా బృహస్పతిని భావిస్తారు. దేవ గురువు బృహస్పతి సంచారం అన్ని రాశుల వారికి చాలా మేలు చేస్తుంది. గురు గ్రహం ప్రస్తుతం మేష రాశిలో సంచరిస్తున్నాడు.

జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన గ్రహాలలో ఒకటి బృహస్పతి. దీని రాశి మార్పు లేదా నక్షత్రం మార్పు అనేది మానవ జీవితాలను ప్రభావితం చేస్తుంది. మే 1 నుంచి గురు గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. అంతకముందే బృహస్పతి తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు.

ప్రస్తుతం బృహస్పతి మేష రాశిలో భరణి నక్షత్రంలో ఉంది. ఏప్రిల్ 17న కృతిక నక్షత్రంలోకి వెళ్లి జూన్ 13 వరకు అక్కడే ఉంటుంది. ఈ వ్యవధిలోనే మేషం నుంచి వృషభ రాశిలోకి గురుగ్రహం ప్రయాణిస్తుంది. 27 నక్షత్రాలలో కృతిక నక్షత్రం మూడవ నక్షత్రం. దీనికి అధిపతి శుక్రుడు. గురు, శుక్ర గ్రహాలు రెండూ స్నేహపూర్వకమైనవి. బృహస్పతి నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి సానుకూల ప్రయోజనాలు ఇస్తుంది. అదృష్టాన్ని తీసుకొస్తుంది. గురు, శుక్ర శుభ ప్రభావాలతో సృజనాత్మక ఆలోచనలు ఉద్యోగంలో మేలు చేస్తాయి.

శుక్రుడు పాలించే నక్షత్రంలో గురు సంచారం వల్ల వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు. మీ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇతరులతో మెరుగైన సంబంధాలు ఏర్పరుచుకుంటారు. ఆర్థికంగా స్థిరపడతారు. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. సంపద, శ్రేయస్సు లభిస్తాయి. మీ సామర్థ్యం నిరూపించుకునేందుకు ఇది మంచి సమయం. బృహస్పతి రాశి మార్పు వల్ల ఎవరికి మేలు జరుగుతుందో చూద్దాం.

మేష రాశి

బృహస్పతి సంచారం మేష రాశి లగ్న గృహంలో జరుగుతుంది. ఈ సమయంలో ప్రత్యేక ఆదరణ పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. బృహస్పతి వృషభ రాశిలోకి మారినప్పుడు డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ తో వివిధ రంగాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలోని పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వివాహం కుదిరే అవకాశం ఉంది. గురు భగవానుడి ఆశీస్సులతో పాటు శుక్రుడి అనుగ్రహం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కర్కాటక రాశి

బృహస్పతి నక్షత్ర మార్పు కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా లాభాలు తీసుకొస్తుంది. ఆధ్యాత్మికంగా బలపడతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. మతపరమైన కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం చురుకుగా ఉంటుంది. పిల్లల నుండి శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చట్టపరమైన విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. పనిలో నిబద్ధతకు సహోద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. రోజువారీ కూలీల ఆదాయం పెరుగుతుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి బృహస్పతి నక్షత్ర మార్పు మంచి చేస్తుంది. వ్యాపారంలో అపారమైన లాభాలు పొందుతారు ఆదాయం పెరిగే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో అందరి ప్రశంసలు అందుకుంటారు. ఈ సమయంలో బోనస్, ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.