Lakshmi narayana yogam: లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశుల వారికి కనక వర్షం, ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది
Lakshmi narayana yogam: మీన రాశిలోకి బుధుడు ప్రవేశించడంతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడింది. దీని వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. డబ్బు సంపాదించగలుగుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు.
Lakshmi narayana yogam: లక్ష్మీనారాయణ యోగం అనేది వేద జ్యోతిష శాస్త్రంలో అత్యంత పవిత్రమైన అదృష్ట యోగం. శుక్రుడు, బుధుడు కలిసి ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది.
ఏప్రిల్ 9 మంగళవారం గ్రహాల రాకుమారుడు బుధుడు మీన రాశి ప్రవేశం చేశాడు. దీనివల్ల ఈ యోగం ఏర్పడుతుంది. రెండు గ్రహాల కలయిక కారణంగా ఏర్పడిన ఈ యోగం వల్ల ఒక వ్యక్తి జీవితంలో శ్రేయస్సు, సంపద, విజయాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు.
శుక్రుడు భౌతిక సమృద్ధి, అందం, విజయానికి కారకుడు. బుధుడు కమ్యూనికేషన్, తెలివితేటలు, వ్యాపార సంబంధం కలిగి ఉన్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఏర్పడిన లక్ష్మీనారాయణ యోగం జాతకంలో ఉండటం వల్ల వారికి ఆర్థిక లాభాలు, వ్యాపార విజయం, సంపూర్ణ శ్రేయస్సు లభిస్తాయి. ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం రెట్టింపు కాబోతుంది. ఇదే సమయంలో బుధుడు సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని కూడా సృష్టిస్తున్నారు. ఒకే సమయంలో ఒకే రాశిలో రెండు శుభకారమైన యోగాలు ఏర్పడుతున్నాయి.
మిథున రాశి
మంగళవారం హనుమంతుడు, దుర్గాదేవి అనుగ్రహంతో మిథున రాశి వారికి నేటి నుంచి శుభదినాలు ప్రారంభమయ్యాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. తోబుట్టువులు మీకు మద్దతుగా నిలుస్తారు. ఉద్యోగరీత్యా గొప్ప పురోగతిని సాధిస్తారు. వ్యాపారంలో గొప్ప లాభాలు పొందుతారు. ఇంట్లోని వాతావరణం ప్రేమ, ఆనందంతో నిండిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది.
సింహ రాశి
లక్ష్మీనారాయణ యోగం సింహ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేయగలుగుతారు. డబ్బులు పెట్టుబడి పెట్టేవారు భవిష్యత్ లో మంచి రాబడి పొందుతారు. బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వాళ్ళు అదృష్టవంతులుగా మారతారు. వ్యాపారాన్ని విస్తరింప చేసుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. దానధర్మాల్లో చురుకుగా పాల్గొంటారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మంచి సంబంధం బలపడుతుంది.
కన్యా రాశి
లక్ష్మీనారాయణ యోగం వల్ల కన్యా రాశి జాతకులు చాలా ఆశీర్వాదాలు పొందబోతున్నారు. అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఏ పని తలపెట్టిన అందులో వారికి అదృష్టం అండగా నిలుస్తుంది. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. శత్రువులను ఓడించి విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తారు. తోబుట్టువులు మద్దతుగా నిలుస్తారు.
మకర రాశి
లక్ష్మీనారాయణ యోగంతో మకర రాశి జాతకులు అన్ని లక్ష్యాలను సాధించగలుగుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రయత్నిస్తారు. భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రేమ పొందుతారు.
కుంభ రాశి
లక్ష్మీ నారాయణ యోగం ప్రభావంతో కుంభరాశి వారి చేతికి డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. ప్రముఖులను కలుసుకుంటారు. వారి వల్ల భవిష్యత్తులో మీకు ప్రయోజనం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. తమ తమ రంగాల్లో మంచి పనితీరు కనబరుస్తారు. పనుల్లో విజయం సాధిస్తారు.