Lord kubera: కుబేరుడి అత్యంత ఇష్టమైన రాశులు ఇవి.. డబ్బుకు కొదువ ఉండదు, అదృష్టం అంటే వీరిదే-lord kubera favorite zodiac signs get always money rain ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Kubera: కుబేరుడి అత్యంత ఇష్టమైన రాశులు ఇవి.. డబ్బుకు కొదువ ఉండదు, అదృష్టం అంటే వీరిదే

Lord kubera: కుబేరుడి అత్యంత ఇష్టమైన రాశులు ఇవి.. డబ్బుకు కొదువ ఉండదు, అదృష్టం అంటే వీరిదే

Gunti Soundarya HT Telugu
May 10, 2024 02:53 PM IST

Lord kubera: సంపదకు అధి దేవుడు కుబేరుడికి అత్యంత ఇష్టమైన రాశులు ఇవి. వీరికి డబ్బుకు కొదువ ఉండదు, అదృష్టం అంటే వీరిదే అనేలాగా జీవిస్తారు. అందులో మీ రాశి ఉందేమో చూసుకున్నారా?

కుబేరుడి అత్యంత ఇష్టమైన రాశులు
కుబేరుడి అత్యంత ఇష్టమైన రాశులు

Lord kubera: హిందూ శాస్త్రం ప్రకారం సంపదకు దేవత లక్ష్మీదేవి. అయితే అధి దేవుడిగా కుబేరుడిని పిలుస్తారు. పురాణాల ప్రకారం కుబేరుడికి సంపద బాధ్యతలు అప్పగించిన రోజు అక్షయ తృతీయ.

కుబేరుడి ఆశీస్సులు ఉంటే ఒక వ్యక్తికి ఆనందం, సంపద అందుతాయి. జీవితం అపారమైన సంపదతో నిండిపోతుంది. కుబేరుడిని ఎవరైతే మెప్పించడంలో విజయవంతం అవుతారో వాళ్ళు జీవితాంతం డబ్బుకు కొరత ఎదుర్కోరు అని నమ్ముతారు. మొత్తం పన్నెండు రాశులకు ఒక్కో రాశిని ఒక్కో గ్రహం పాలిస్తుంది.

గ్రహాల ప్రభావం వల్ల అన్ని రాశుల వారికి దేవుళ్ళు, దేవతల అనుగ్రహం లభిస్తుంది. అయితే కుబేరుడికి కూడా ఇష్టమైన రాశులు ఉన్నాయి. ఈ మూడు రాశుల వారి పట్ల కుబేరుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. సంపదకు ప్రతీకగా శుక్రుడిని భావిస్తారు. ఈ గ్రహం ఆర్థిక సమృద్ధిని ఇస్తుంది. వృషభ రాశికి చెందిన వారికి శుక్రుడి ఆశీస్సులతో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. తమ జీవితంలో ఏ పని చేపట్టిన కచ్చితంగా విజయం సాధిస్తారు. దీనితో పాటు జీవితంలోని సమస్యలు ఎక్కువ రోజులు వీళ్ళని ఇబ్బంది పెట్టలేవు. త్వరగా పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవం చాలా పెరుగుతుంది. కుటుంబంలో అందరితో కలిసిపోతారు. అందరితో సన్నిహితంగా ఉంటారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశికి చెందిన వాళ్ళ అంటే కుబేరుడికి చాలా ఇష్టం. ఈ రాశికి పాలకుడుగా చంద్రుడు వ్యవహరిస్తాడు. చల్లని, ప్రశాంతమైన, స్నేహపూర్వకమైన మనసుని చంద్రుడు కలిగి ఉంటాడని నమ్ముతారు. చాలా కష్టపడి పనిచేస్తారు. ఎంతో కృషి చేసి వారు తమ లక్ష్యాలను సాధించుకుంటారు. ఎలాంటి ఛాలెంజ్ నైనా ఎదుర్కోగల సమర్థులు. జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేందుకు పూర్తి అవకాశం పొందుతారు. జ్ఞానం, తెలివితేటలు, ప్రతిభ ద్వారా జీవితంలోని ప్రతి అంశంలో విజయం సాధిస్తారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. అత్యంత ఇష్టమైన రాశి ఇది. ఈ రాశి జాతకులు ఆధ్యాత్మికతలో మునిగిపోతారు. అందువల్లే భగవంతుడైన కుబేరుడి ఆశీస్సులు పొందుతారు. డబ్బు, అదృష్టంతో తులతూగుతారు.

కుబేరుడి ఆశీర్వాదం పొందే మార్గాలు

మీ జీవితాన్నే సంతోషంగా, సంపూర్ణంగా మార్చుకోవాలి అనుకుంటే, కుబేరుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే ఈ పరిహారాలు పాటించి చూడండి. ఇవి మీకు తప్పనిసరిగా సహాయపడతాయి.

ఇంటి దక్షిణ లేదా నైరుతి గోడపై లాకర్ లేదా ఆల్మరాన్ని ఏర్పాటు చేసుకొని అందులో డబ్బులు ఉంచుకోవాలి. దాని తలుపు ఉత్తరాన తెరిచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ దిశ కుబేరుడితో సంబంధం కలిగి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఉత్తరం వైపు తలుపు తెరవడం వల్ల మీ లాకర్ లో నిరంతరం డబ్బు ఉంటుంది.

డబ్బు పెంచడానికి నగదు లాకర్ ముందు అద్దం ఉంచండి. మీరు మీ లాకర్ ప్రతిమ అద్దంలో కనిపించే విధంగా చూసుకోవాలి. ఇది మీ ఆస్తులను పెంచుతుంది.

ఎవరి దగ్గర ఉచితంగా ఏమి తీసుకోవద్దు, ఎవరికి ఉచితంగా ఏమి ఇవ్వకూడదు. అయితే దానం చేస్తే మాత్రం మూడో కంటికి కూడా తెలియకుండా దానం చేయడం వల్ల కుబేరుడు సంతోషిస్తాడు.

మీ ఆదాయంలో కొంత భాగాన్ని దాతృత్వ సేవలకు ఉపయోగించాలి. ఇది మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఇంటికి శ్రేయస్సు తీసుకువస్తుంది.

కుటుంబంలో మహిళలకు తప్పనిసరిగా గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఇంటి ఇల్లాలిని లక్ష్మీదేవి స్వరూపంగా నమ్ముతారు.

ఇంట్లో కుబేర యంత్రాన్ని ఉంచి క్రమం తప్పకుండా పూజించాలి. ఇలా చేస్తే మీ ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది.

ఇంట్లో తులసి మొక్క నాటాలి. మొక్క ముందు ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడూ కొలువై ఉంటుంది.

విరిగిన చిత్రపటాలు, చిరిగిపోయిన వస్త్రాలు, పగిలిన వస్తువులు ఏవి ఇంట్లో ఉంచుకోకూడదు. ఇవి ఉంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది.

WhatsApp channel