Jupiter rise: ఉదయించబోతున్న బృహస్పతి.. వీరికి గోల్డెన్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి
Jupiter rise: దేవ గురువు బృహస్పతి త్వరలో ఉదయించబోతున్నాడు. దీని ప్రభావం కొన్ని రాశుల మీద ఉండనుంది. ఫలితంగా వీరికి గోల్డెన్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి.
Jupiter rise: ప్రతి గ్రహం నిర్ణీత సమయం తర్వాత ఒక రాశి నుండి మరొక రాశికి మారుతుంది. గ్రహాల సంచారంతో ప్రజల జీవితాల్లో హెచ్చు తగ్గులకు కారణమవుతాయి. కొంత సమయం తర్వాత గ్రహాలు అస్తంగత్వ దశలోకి వెళతాయి. కొంతకాలానికి ఉదయిస్తాయి.
జూన్ నెలలో దేవ గురువు బృహస్పతి ఉదయించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహాన్ని శుభకరమైనదిగా భావిస్తారు. జూన్ 3వ తేదీ వృషభ రాశిలో బృహస్పతి ఉదయిస్తాడు. ఈ గ్రహం సంపదను ప్రసాదిస్తుంది. మతం, ఆధ్యాత్మికతతో సంబంధం ఉన్న గ్రహం.
అదృష్టాన్ని, సంపదని తీసుకొచ్చే గ్రహంగా పరిగణిస్తారు. ధనుస్సు, మీన రాశికి పాలక గ్రహంగా ఉంటాడు. మే 7న గురు గ్రహం అస్తంగత్వ దశలోకి వెళ్ళాడు. బృహస్పతి వృషభ రాశిలో ఉదయించినప్పుడు కేంద్ర త్రిభుజ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి. ఈ యోగం ప్రభావంతో ఆదాయం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. వృత్తి సమస్యలు తొలగిపోతాయి.
వృషభ రాశి
బృహస్పతి ఈ రాశిలోనే ఉదయించనున్నాడు. ఫలితంగా వీరికి ఎక్కువ లాభం చేకూరుతుంది. మీ ఆలోచనలు అమలు చేసేందుకు ఈ సమయం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉపాధి కూలీలకు జీతాలు పెరుగుతాయి. కష్టపడి పని చేస్తారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకంలో తొమ్మిదో ఇంట్లో బృహస్పతి ఉదయిస్తాడు. ఈ సమయం వీరికి గొప్పగా ఉంటుంది. అదృష్టం పూర్తి మద్ధతు ఉంటుంది. దీనితో పాటు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా ఉత్సాహంగా ఉంటారు. పనులన్నింటినీ సులభంగా పూర్తి చేస్తారు. ఏదైనా మతపరమైన, పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు కలలను సాకారం చేసుకుంటారు.
సింహ రాశి
సింహ రాశి వారికి బృహస్పతి పెరుగుదల సహాయపడుతుంది. ఉద్యోగులకు పనిలో సానుకూల ఫలితాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్ కోసం అవకాశాలు వస్తాయి. ఉద్యోగం మారాలని అనుకుంటే మీ ఆశయం నెరవేరుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు పొందుతారు. వ్యాపారవేత్తలు లాభాలు పొందుతారు. వ్యాపారాన్ని పెంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
కన్యా రాశి
వృత్తిలో గణనీయమైన మార్పులు ఉంటాయి. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు ఆశించిన దాని కంటే మెరుగైన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది.
ధనుస్సు రాశి
శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. న్యాయపరమైన విషయాల్లో విజయం మీ సొంతం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనం పొదుపు చేసే మార్గాలు ఏర్పడతాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉంది. శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.