బుధవారం ఈ పరిహారాలు చేస్తే ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి-easy wednesday remedies for career and business success ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బుధవారం ఈ పరిహారాలు చేస్తే ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి

బుధవారం ఈ పరిహారాలు చేస్తే ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి

Jul 26, 2023, 10:19 AM IST HT Telugu Desk
Jul 26, 2023, 10:19 AM , IST

  • Wednesday remedies: మీ వ్యాపారంలో వృద్ధి, లాభాల కోసం బుధవారం రోజు గణేశుడిని పూజించాలి. కెరీర్, వ్యాపార మెరుగుదల కోసం బుధవారం ఎలాంటి పరిహారాలో చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

బుధవారాలు వినాయకుడిని పూజిస్తారు. ఎప్పుడైనా సరే గణేషుడికే మొదటి పూజ. బుధ గ్రహం పేరు మీదుగా బుధవారానికి పేరు వచ్చింది. ఈ రోజున గణపతికి ఉపవాసం ఆచరిస్తారు. విఘ్నహర్త గణేశుడు తన భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. వ్యాపారాభివృద్ధికి, లాభానికి బుధవారం గణేష్ పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.

(1 / 5)

బుధవారం రోజు పెసర్లు దానం చేయాలి. ఈ రోజు పెసర పప్పు తింటే మేలు జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీ కుండలిలో బుధుని స్థానం బలపడుతుందని విశ్వాసం.

(2 / 5)

మీరు రుణ విముక్తి పొందాలంటే మీరు బుధవారం గణేష్ స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి మీ కెరీర్ మెరుగుపడుతుంది.

(3 / 5)

బుధవారం నాడు వినాయకుడికి శమీపత్రం నైవేద్యంగా సమర్పించాలి. శమీ పత్రంతో పాటు దర్బా గడ్డిని కూడా శ్రీ గణేశుడికి నైవేద్యంగా సమర్పించాలి, ఇలా చేయడం వల్ల శ్రీ గణేశుడు చాలా త్వరగా సంతోషిస్తాడు. మనసులోని కోరికలన్నీ నెరవేరుస్తాడు.

(4 / 5)

బుధవారం ఒక ప్రత్యేకమైన రోజు, ఈ రోజున ఆవులకు ఆహారం ఇవ్వడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గోవులకు ఆహారం ఇవ్వడం ద్వారా దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు