తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశి వారికి వివాదాలు తలెత్తవచ్చు! ఓర్పుతో వ్యవహరించండి

Today Rasi phalalu: నేటి రాశి ఫలాలు: ఈ రాశి వారికి వివాదాలు తలెత్తవచ్చు! ఓర్పుతో వ్యవహరించండి

Ramya Sri Marka HT Telugu

30 November 2024, 0:05 IST

google News
    • Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 30.11.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

రాశిఫలాలు (నేటి రాశిఫలాలు) 30-11-2024

లేటెస్ట్ ఫోటోలు

Naval Dockyard Apprentice 2024 : విశాఖ నేవల్ డాక్ యార్డ్ లో 275 అప్రెంటీస్ ఖాళీలు - ముఖ్య తేదీలివే

Nov 29, 2024, 09:54 PM

BMW M2: భారత్ లో బీఎండబ్ల్యూ ఎం2 లేటెస్ట్ ఎంట్రీ.. స్టైలింగ్ లో తిరుగులేని స్పోర్ట్ కూపే ఇది..

Nov 29, 2024, 09:50 PM

Hair fall problem: చలి కాలంలో జుట్టు ఊడే సమస్యకు కారణాలివే..

Nov 29, 2024, 09:31 PM

త్వరలో ఈ నాలుగు రాశుల వారికి మెండుగా అదృష్టం.. సంపద, ఆనందం!

Nov 29, 2024, 07:01 PM

AP Tourism : ఆంధ్ర ఊటీ అరకులోయ సిగలో.. మరో పర్యాటక సోయగం.. డోంట్ మిస్

Nov 29, 2024, 02:41 PM

TG Weather Updates : రేపట్నుంచి తెలంగాణలోనూ వర్షాలు - ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు, తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

Nov 29, 2024, 02:28 PM

సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం, అయనము: దక్షిణాయనం,

మాసం: కార్తీకము, తిథి : బ.చతుర్దశి, వారం: శనివారం, నక్షత్రం: విశాఖ

మేషం:

వివాదాలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నం చేస్తారు. బాల్యమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు, వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం:

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయనాయకులు, కళాకారులు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది.

మిథునం:

కొత్తవారితో పరిచయమవుతుంది. అనుకున్న పనులు చకచకా పూర్తవుతాయి. ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనవ్యయ సూచన. కుటుంబంలో సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:

ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. అనారోగ్య సూచన. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పనుల్లో జాప్యం చోటుచేసుకుంటుంది. కళారంగం వారికి శ్రమాధిక్యం. వివాదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి.

సింహం:

కొత్త పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు తీరతాయి. ఇంటి నిర్మాణ సమస్యలనుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులకు కలసివస్తుంది. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది.

కన్య:

పనులు చకచకా పూర్తవుతాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అందరినుంచి సహకారం లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణలు చేపడతారు. క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది.

తుల:

ఖర్చులు పెరుగుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. వివాదాలు తలెత్తవచ్చు. మాట అదుపు చేసుకోండి. శ్రమానంతరం పనులు పూర్తవుతాయి. వాహన కొనుగోలు యత్నాలు చేస్తారు. ఉద్యోగులు పై అధికారుల ప్రశంసలను అందుకుంటారు. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం:

దీర్ఘకాల సమస్య నుంచి గట్టెక్కుతారు. ధనవ్యయ సూచన. భూములు, వాహన కొనుగోలు యత్నం చేస్తారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. పనులు నెమ్మదిగా జరుగుతాయి. వివాదాలు తలెత్తవచ్చు. అప్రమత్తంగా ఉండండి.

ధనుస్సు:

కొత్త అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వివాహయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణ చేపడతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. వాహన, స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తారు.

మకరం:

ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయనాయకులకు గుర్తింపు లభిస్తుంది. కళాకారులు,క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కుంభం:

కొత్తపనులు పూర్తవుతాయి. ఆస్తుల వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నం చేస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలు తలెత్తవచ్చు. ఓర్పుతో వ్యవహరించండి.

మీనం:

పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇంటి నిర్మాణ పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుంది. రాజకీయ నాయకులకు గుర్తింపు లభిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం