TG Weather Updates : రేపట్నుంచి తెలంగాణలోనూ వర్షాలు - ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు, తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో-heavy rains are likely in telangana from november 30 imd weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Weather Updates : రేపట్నుంచి తెలంగాణలోనూ వర్షాలు - ఈ జిల్లాలకు Imd హెచ్చరికలు, తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

TG Weather Updates : రేపట్నుంచి తెలంగాణలోనూ వర్షాలు - ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు, తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

Nov 29, 2024, 02:28 PM IST Maheshwaram Mahendra Chary
Nov 29, 2024, 02:28 PM , IST

  • Telangana Weather Updates : తుపాన్ ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు పడనున్నాయి. 3 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిమీ వేగంతో కదులుతుందని ఐఎండీ తాజా బులెటిన్ లో తెలిపింది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 270 కి.మీ, నాగపట్నానానికి 300 కి.మీ, పుదుచ్చేరికి 340 కి.మీ, చెన్నైకి 380 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని… రాగల 6 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.

(1 / 7)

రేపు(నవంబర్ 30) మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

(2 / 7)

తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

(3 / 7)

ఇక తెలంగాణలో రేపట్నుంచి(నవంబర్ 30) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

(4 / 7)

రేపు(నవంబర్ 30) ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 

(5 / 7)

ఇక డిసెంబర్ 1వ తేదీన కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 

(6 / 7)

డిసెంబర్ 2వ తేదీన కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. ఇక 3వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని… ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు