AP Tourism : ఆంధ్ర ఊటీ అరకులోయ సిగలో.. మరో పర్యాటక సోయగం.. డోంట్ మిస్-ap tourism department makes tree decks available in araku valley ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tourism : ఆంధ్ర ఊటీ అరకులోయ సిగలో.. మరో పర్యాటక సోయగం.. డోంట్ మిస్

AP Tourism : ఆంధ్ర ఊటీ అరకులోయ సిగలో.. మరో పర్యాటక సోయగం.. డోంట్ మిస్

Published Nov 29, 2024 02:41 PM IST Basani Shiva Kumar
Published Nov 29, 2024 02:41 PM IST

  • AP Tourism : ఆంధ్రా ఊటీ అరకు మంచు అందాలతో కనువిందు చేస్తోంది. దీంతో పర్యాటకుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అరకులోయను సందర్శించే టూరిస్టులకు కొత్త అనుభూతిని పంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా ట్రీ డెక్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

అరకు.. ఈ పేరు వినగానే ఆహ్లాదకరమైన వాతావరణం కళ్ల ముందు కనిపిస్తుంది. ఇక్కడ కాఫీ తోటలు చాలా స్పెషల్. ఈ కాఫీ తోటలను చూసేందుకు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో.. టూరిస్టులు సరికొత్త అనుభూతి పొందేలా ఏపీ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.

(1 / 5)

అరకులోయ అడవుల్లో చెక్కతో చేసిన మెట్లు, ఫొటోలు తీసుకునేందుకు వీలుగా ట్రీ డెక్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కాఫీ తోటల వద్ద టూరిస్టులు నడుచుకుంటూ మొక్కలు వద్దకు వెళ్లేలా చెక్కతో మెట్లు ఏర్పాటు చేశారు. 

(2 / 5)

కాఫీ తోటలకు నీడనిచ్చే సిల్వర్‌ ఓక్‌ వృక్షాల వద్ద ట్రీ డెక్‌‌లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మెట్ల గుండా డెక్‌ వద్దకు వెళ్లి పర్యాటకులు ఫొటోలు తీసుకులా ఏర్పాట్లు చేశారు. 

(3 / 5)

ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ రూ. 16 లక్షలు వెచ్చించి వీటిని నిర్మించింది. వీటిపై ఎక్కి మంచి ఫోటోలు తీసుకుంటూ.. సరికొత్త అనుభూతి పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.

(4 / 5)

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా.. వీటిని ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు