Lucky zodiac signs: నవంబర్ వరకు ఈ రాశుల వారి ఆదాయానికి అదుపు ఉండదు, ఉద్యోగులకు పదోన్నతులు-jupiter in mrugasira nakshtram three zodiac signs get full benefits till 2025 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Zodiac Signs: నవంబర్ వరకు ఈ రాశుల వారి ఆదాయానికి అదుపు ఉండదు, ఉద్యోగులకు పదోన్నతులు

Lucky zodiac signs: నవంబర్ వరకు ఈ రాశుల వారి ఆదాయానికి అదుపు ఉండదు, ఉద్యోగులకు పదోన్నతులు

Gunti Soundarya HT Telugu
Sep 13, 2024 06:43 PM IST

Lucky zodiac signs: బృహస్పతి ప్రస్తుతం మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. దీని ప్రభావంతో నవంబర్ వరకు మూడు రాశుల వారి ఆదాయానికి అదుపు ఉండదు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది.

మృగశిర నక్షత్రంలో బృహస్పతి
మృగశిర నక్షత్రంలో బృహస్పతి

Lucky zodiac signs: దేవ గురువు బృహస్పతి నవగ్రహాలలో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇది ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్లేందుకు ఒక సంవత్సరం పడుతుంది. మొత్తం పన్నెండు రాశులను పూర్తి చేసేందుకు 12 సంవత్సరాలు పడుతుంది. గురు గ్రహం రాశిని మార్చడమే కాకుండా ఎప్పటికప్పుడు నక్షత్రాన్ని మారుస్తాడు.

20 ఆగస్ట్ 2024న బృహస్పతి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించాడు. నవంబర్ వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు. బృహస్పతి నక్షత్ర మార్పు అన్నీ రాశుల వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని రాశిచక్ర గుర్తులు దాని నుండి భారీ ప్రయోజనాలను పొందుతాయి.

వేద జ్యోతిషశాస్త్రంలో 27 నక్షత్రాల జాబితాలలో మృగశిర నక్షత్రం ఐదవ స్థానంలో ఉంది. ఈ నక్షత్రానికి అధిపతి అంగారకుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పరిశోధనాత్మక స్వభావం కలిగి ఉంటారు. కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. జ్ఞానాన్ని పెంచుకునేందుకు నిరంతరం శ్రమిస్తారు. ఈ వ్యక్తులు చాలా ఉల్లాసంగా, మర్యాదగా, స్నేహపూర్వకంగా ఉంటారు. మృగశిర నక్షత్రంలోకి బృహస్పతి సంచారం వల్ల ప్రయోజనం పొందే రాశులు ఏవో చూద్దాం.

వృషభ రాశి

బృహస్పతి తన నక్షత్రాన్ని మార్చిన తర్వాత వృషభ రాశి లగ్న గృహంలో సంచరిస్తాడు. వివిధ అంశాలలో గొప్ప విజయాన్ని పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆర్థిక స్థితిని మెరుగుపడుతుంది. విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది. ఉద్యోగం చేసే చోట కొన్ని శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీర్ఘకాలంగా ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు ఇప్పుడు దాని నుండి బయటపడతారు. ప్రేమ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. ఒంటరి వ్యక్తులు తమ కలల భాగస్వామిని కలుసుకుంటారు.

కన్యా రాశి

మృగశిర నక్షత్రంలో బృహస్పతి సంచారము కన్యారాశి వారికి ఫలవంతమైన సమయం. కెరీర్‌లో చాలా పురోగతి సాధిస్తారు. అదృష్టం అండగా ఉంటుంది. భౌతిక ఆనందాలు పొందుతారు. జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. షేర్ మార్కెట్ నుండి లాభాలను ఆర్జిస్తారు. కార్యాలయంలో మీ ప్రవర్తన, పనితో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు.

కర్కాటక రాశి

బృహస్పతి తన నక్షత్రాన్ని మారిన తర్వాత కర్కాటక రాశిలో పదకొండవ ఇంట్లో సంచరిస్తాడు. ఇది ఆదాయ గృహం. ఆదాయంలో విపరీతమైన పెరుగుదలను చూస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి. జీవితంలోని వివిధ రంగాలలో విజయం సాధించే అవకాశం లభిస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. కార్యాలయంలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగంతో సంతృప్తి చెందుతారు. పనికి ప్రశంసలు అందుకుంటారు. ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఇది మీరు ఉద్యోగంలో నిర్ధిష్ట లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. వ్యాపారులకు భారీ లాభాలు వస్తాయి.