Vastu Tips for Health: ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యమా- ఇంట్లో నుంచి వీటిని వెంటనే బయటపడేయండి-sickness one after another in the house according to vastu shastra get them out of the house immediately ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips For Health: ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యమా- ఇంట్లో నుంచి వీటిని వెంటనే బయటపడేయండి

Vastu Tips for Health: ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యమా- ఇంట్లో నుంచి వీటిని వెంటనే బయటపడేయండి

Ramya Sri Marka HT Telugu
Nov 20, 2024 02:30 PM IST

Vastu Tips for Health: ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్య తలెత్తుతుందా. ఎన్ని రకాల మందులు వాడుతున్నా లాభం లేదా. అయితే వెంటనే మీరు ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను బయటపడేయాలి.

ఆరోగ్యం కోసం వాస్తు సలహాలు
ఆరోగ్యం కోసం వాస్తు సలహాలు (i stock)

ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయా. ఎన్ని మెడిసిన్లు వాడిన లాభం కనిపించడం లేదా. ఇందుకు కారణం కేవలం వాతావరణంలో మార్పు మాత్రమే కాకపోవచ్చు. మీ ఇంట్లో ఉన్న కొన్ని రకాల వస్తువులు అయి ఉండచ్చు. అవును.. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల కూడా తరచూ ఇలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఆరోగ్యానికి వాస్తుకు సంబంధం ఉంటుందా అంటే కచ్చితంగా అవుననే చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణంలో మాత్రమే కాదు.. ఇంట్లోని వస్తువుల విషయంలో కూడా ఆచరించాల్సి ఉంటుంది. వాస్తు సరిగ్గా లేకపోతే ఇంట్లోని వ్యక్తుల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందట. అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచుకోవడం వల్ల ఇంట్లో వారిని తరచూ అనారోగ్య సమస్యలు వేధిస్తాయట. వాస్తు శాస్త్రం ప్రకారం ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో ఉండకూడని వస్తువులేంటో చూద్దాం.

  • పగిలిన వస్తువులు: అనారోగ్య సమస్యల నుంచి దూరంగ కావాలంటే వెంటనే ఇంట్లోని పగిలిన, పాడైపోయిన వస్తువులన్నింటిని తీసి బయటపడేయాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇవి నెగిటివ్ ఎనర్జీలకు నిలయంగా మారి ఇంట్లో అందిరనీ అనారోగ్యం పాలు చేస్తుంది.
  • అద్దం: వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం ఎన్నో అనర్థాలకు మూలం. నెగిటివ్ ఎనర్జీలను ఇట్టే ఆకట్టుకోగల శక్తి అన్నింటికన్నా అద్దానికి ఎక్కువగా ఉంటుంది. అలాంటి అద్దం పగలిపోయి ఉంటే వెంటనే దాన్ని ఇంట్లో నుంచి బయట పడేయండి. లేదంటే ఇది ప్రతికూల శక్తులను మూటకట్టి దాచిపెట్టి మరీ మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.
  • చెత్త డబ్బా: ఈ మధ్య చెత్త డబ్బాను ఇంట్లో పెట్టుకోవడం అలవాటుగా మారింది. ముఖ్యంగా వంటగదిలో సింకు కింద ఎక్కువ మంది చెత్త డబ్బాను ఉంచుతున్నారు. వాస్త్రు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద పొరపాటు. చెత్త అంటే ప్రతికూల శక్తులకు, అనారోగ్యానికి సంకేతం. అలాంటి చెత్తడబ్బాలో ఇంట్లో పెట్టుకోవడం, అది కూడా ఆహారానికి నిలయమైన వంటగదిలో ఉంచకోవడం అస్సలు మంచిదికాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చెత్తను ఎప్పుడూ ఇంటి బయట లేదంటే గుమ్మానికి చాలా దూరంగా ఉంచితేనే ఇంట్లోకి ప్రతికూల శక్తులు, అనారోగ్య కారకాలు ప్రవేశించకుండా ఉంటాయి.
  • చెప్పులు: చెప్పులు కొత్తవే కదా అని చాలా మంది ఇంట్లో మంచం కిందో లేక ఏదో ఒక అరలో పెడుతున్నారు. కొత్తవైనా, పాతవైన చెప్పులు నెగిటివ్ ఎనర్జీని, హానికరమైన క్రిములను కలిగి ఉంటాయి. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గొడవలు, చికాకులు పెరుగుతాయి.
  • విరిపోయిన బొమ్మలు:మనకు చాలా ఇష్టమైనవి అని కొన్ని వస్తువులు పాడైపోయిన తర్వాత కూడా ఇంట్లోనే దాచి పెట్టుకుంటాం. అలాంటి వాటిలో ఫొటోలు, బొమ్మలు ఉంటాయి. వాస్తు ప్రకారం విరిగిపోయిన బొమ్మలు, రంగు పోయి, పాడైపొయిన సీనరీలు వంటివి నెగిటివ్ ఎనర్జీలకు మూలకంగా వ్యవహరిస్తాయి. వీటిలో అలాగే ఇంట్లో ఉంచుకోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
  • మెడిసిన్: ఈ రోజుల్లో అనారోగ్యాలు, వాటికి మందులూ కామన్ అయిపోయాయి. అయితే చాలా మంది మెడిసిన్ ను వంట గదిలో ఉంచుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మెడిసిన్ ను వంటగదిలో ఉంచడం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతాయట.
  • సరుకులు: కాలం గడిచిన సరుకులు, పురుగు పట్టిన పప్పులు, పిండి వంటివి, పాడైపోయిన పండ్లు, కూరగాయలను తర్వాత పడేద్దాం అని ఎప్పుడూ వదిలేయకూడదు. వీటిని ఇంట్లొ ఉంచడం వల్ల హానికరమైన క్రిములు, ప్రతికూల శక్తులు పెరిగి ఇంట్లోని వారందరినీ అనారోగ్యం పాలు చేస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner