Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఎన్ని సమస్యలున్నా.. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు
27 November 2022, 5:00 IST
- Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 27వ తేదీ 2022న కెరీర్ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (27-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లేటెస్ట్ ఫోటోలు
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఘర్షణలు, మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిని జాగ్రత్తగా చేయండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. మరిన్ని శుభఫలితాలు పొందడం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల జాగ్రత్త వహించండి. మనస్తాపము, అనారోగ్యం కలిగే అవకాశముంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా.. శ్రమతో, ఆలోచనతో ధైర్యంగా ముందుకు సాగుతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని, దుర్గాదేవిని పూజించండి.
మిధున రాశి
మిధున రాశివారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలంగా ఉంటుంది. మానసిక వేదనలు, ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఏర్పడుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధన లాభము కలుగుతుంది. శుభఫలితాల కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగుతాయి. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించాలి.
సింహ రాశి
సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తలు వహించండి. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకము పఠించాలి. ఈరోజు ఆదిత్య హృదయాన్ని పఠించాలి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. మీరు అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణములు లాభిస్తాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి.
తులా రాశి
తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. మానసిక వేదన, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబమునందు, ఉద్యోగ, వ్యాపారమునందు చికాకులు కలుగుతాయి. విరోధులతో జాగ్రత్తగా వ్యవహరించండి. స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు అంత అనుకూలముగాలేదు. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా.. అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మంచిది.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల యందు ఆచితూచి వ్యవహరించండి. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్తంగా ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేస్తారు. ధనలాభము, సౌఖ్యము పొందుతారు. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు ఎక్కువగా ఉంటాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలముగా ఉంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కలసి వస్తుంది. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగుతారు. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం వంటివి చదువుకుంటే మంచిది.
మీన రాశి
మీన రాశి వారికి ఈరోజు అనుకూలముగా ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉంటే మంచిది. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. కీర్తి, సౌఖ్యము కలుగుతుంది. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయాలి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Contact : 9494981000
టాపిక్