Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే ఆ రాశులవారికి మంచిది..-today horoscope in telugu based on career and life for 26th november 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 26th November 2022

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే ఆ రాశులవారికి మంచిది..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 26, 2022 05:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 26వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (26-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఘర్షణలు, మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఖర్చులు ఎక్కువ అవుతాయి. ప్రతి పనిని జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మధ్యస్తముగా ఉంది. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మనస్తాపము, అనారోగ్యం కలుగే అవకాశాలున్నాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రతికూల పరిస్థితులు, వ్యాపారస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ.. ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం సాధిస్తారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిథున రాశి

మిథున రాశివారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలంగా ఉంటుంది. మానసిక వేదనలు, ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధన లాభము కలుగుతుంది. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగుతాయి. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లండి. శనికి తైలాభిషేకం చేస్తే మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించండి. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, ఆనందము పొందుతారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. మానసిక వేదన, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబమునందు, ఉద్యోగ, వ్యాపారమునందు చికాకులు ఉంటాయి. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉంటే మంచిది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు అంత అనుకూలముగాలేదు. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబములో గొడవలయ్యే అవకాశముంది. అయినప్పటికీ మీ సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల పట్ల ఆచితూచి వ్యవహరించండి. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ధనలాభము, సౌఖ్యము కలుగుతుంది. కానీ ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు ఎక్కువగా ఉంటాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలముగా ఉంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈరోజు కలసి వస్తుంది. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ.. ఏదో రకంగా ముందుకు సాగుతారు. ఖర్చులు నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. చేసే ప్రతీ పనికి కొంత అనుకూల ఫలితములు ఉంటాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు మీకు అనుకూలముగా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్