తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశి వారు కచ్చితంగా ఖర్చులు తగ్గించుకోవాలి..

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశి వారు కచ్చితంగా ఖర్చులు తగ్గించుకోవాలి..

25 November 2022, 5:00 IST

    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 25వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (25-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారికి టైమ్​ వచ్చింది- భారీ ధన లభాం, ఉద్యోగంలో ప్రమోషన్​.. అనుకున్నది సాధిస్తారు!

May 07, 2024, 05:50 AM

మే 7, రేపటి రాశి ఫలాలు.. రేపు వీరికి ఆదాయం ఫుల్, మనసు ఖుషీగా ఉంటుంది

May 06, 2024, 08:31 PM

Malavya Rajyog 2024: మాలవ్య రాజయోగం: ఈ రాశుల వారికి అదృష్టం! ఆర్థిక లాభాలతో పాటు మరిన్ని ప్రయోజనాలు

May 06, 2024, 04:49 PM

ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు! ఆర్థికంగా ఇబ్బందులు- జీవితంలో ఒడుదొడుకులు..

May 06, 2024, 09:45 AM

Saturn Retrograde : శని తిరోగమనం.. వీరికి జీతాల్లో పెంపు, అన్నీ శుభవార్తలే

May 06, 2024, 08:32 AM

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి! ఆరోగ్య సమస్యలు- భారీ డబ్బు నష్టం..

May 05, 2024, 04:07 PM

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఆర్ధిక విషయాల పట్ల జాగ్రత్త వహించండి. చికాకులు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినా మీ తెలివితేటలతో ముందుకు సాగుతారు. కుటుంబంలో సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబములో కలహములు వచ్చే అవకాశముంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకము,లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.

మిథున రాశి

మిథున రాశివారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కుటుంబమునందు సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆందోళన, ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారము, ధన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. చికాకులు ఎక్కువగా ఉంటాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు వస్తాయి. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబము నందు కొన్ని సమస్యలు ఉంటాయి. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరింత శుభఫలితాలు పొందాలంటే ఆవునేతితో దీపారాధన చేస్తూ లక్ష్మీదేవిని పూజించాలి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ, ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించండి. శుభఫలితాలు పొందడం కోసం లక్ష్మీ అష్టకాన్ని పఠించి ఆవునేతితో దీపారాధన చేయడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. మీరు అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. మనోధైర్యంతో ముందుకు వెళ్లి విజయము పొందుతారు. ప్రయాణములు లాభిస్తాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండదు. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల పట్ల జాగ్రత్త వహించండి. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణములు అనుకూలిస్తాయి. లాభములు కలుగుతాయి. సౌఖ్యము పొందుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం ఆవునేతితో దీపాన్ని వెలిగిస్తే మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ధనలాభము, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము ఉంటుంది. సమాజములో కీర్తి, కుటుంబములో గౌరవము పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకం పఠించడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితములు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము కలుగుతుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభము, సౌఖ్యము, ఆనందము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన కలుగుతుంది. మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శారీరక సౌఖ్యం కోసం ఖర్చు చేస్తారు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కృషితో, పట్టుదలతో ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించడం అలాగే ఆవునేతితో దీపారాధన చేయడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్తం నుంచి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు లాభము, సౌఖ్యము కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. చేసే ప్రతీ పనియందు కొంత అనుకూల ఫలితాలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కోర్టు వ్యవహారాలు చికాకులు పెడతాయి. చేసే ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్ర నామాన్ని పారాయణం చేయడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

టాపిక్