తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Horoscope Today Check Telugu Rasi Phalalu Astrological Predictions For 21st November 2022

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : శుభ ఫలితాలు పొందాలంటే.. శివారాధన చేయండి..

21 November 2022, 4:30 IST

    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 21వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (21-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

వృషభ రాశిలోకి గురువు.. ఈ రాశుల వారికి ధన లాభం- కానీ..

May 03, 2024, 05:35 AM

మే 3, రేపటి రాశి ఫలాలు.. రేపు భూమి, వాహనాలు కొనుగోలు చేసేందుకు అనువైన రోజు కాదు

May 02, 2024, 08:29 PM

Saturn retrograde: శని తిరోగమనం.. ఐదు నెలల వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు

May 02, 2024, 07:05 PM

మే 2, రేపటి రాశి ఫలాలు.. రేపు రాజకీయ నాయకులకు కష్టసమయం, శత్రువులను గుర్తించండి

May 01, 2024, 08:31 PM

Shukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే, కోరికలు నెరవేరతాయి

May 01, 2024, 02:35 PM

మే 1, రేపటి రాశి ఫలాలు.. పనిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయి, ఎవరినీ చూసి మోసపోవద్దు

Apr 30, 2024, 09:06 PM

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మధ్యస్తంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు ఉండే అవకాశముంది. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

వృషభ రాశి

ఈరోజు మీకు అనుకూలముగా ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. శారీరక శ్రమ కొంత ఎక్కువగా ఉంటుంది. మానసికంగా కాస్త ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృషభరాశివారు లింగాష్టకాన్ని పఠించడం మంచిది.

మిధున రాశి

ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉంటుంది. పిల్లల వలన చికాకులు ఉంటాయి. ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడుతాయి. ప్రయాణమునందు ఖర్చులు ఎక్కువ అవుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మిధునరాశివారు రుద్రాభిషేకము, శివారాధన చేస్తే మంచిది.

కర్కాటక రాశి

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. శారీరక సౌఖ్యమును పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బిల్వాష్టకము, శివాభిషేకం చేస్తే మంచిది.

సింహ రాశి

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో శివునికి అభిషేకము చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధనలాభము కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం చంద్రశేఖరాష్టకము, లింగాష్టకం పఠిస్తే మంచిది.

తులా రాశి

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. పనుల్లో ఆటంకములు ఏర్పడుతాయి. ప్రతీ పనిని ఆచితూచి చేయడం మంచిది. శరీర సౌఖ్యం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. మానసిక ఆనందము కలుగుతుంది. ధనలాభము ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివునికి అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగములో ఒత్తిడి, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లింగాష్టకము, బిల్వాష్టకము పఠిస్తే మంచిది.

ధనూ రాశి

ఈరోజు మీకు మధ్యస్థంగా ఉంటుంది. మీరు చేసే ప్రతీ పనిని ఆచితూచి చేయండి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బంధు వియోగం ఏర్పడుతుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో శివునికి అభిషేకం చేస్తే మంచిది.

మకర రాశి

ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా చేయడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివుని పంచామృతాలతో అభిషేకం చేయండి.

కుంభ రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఆనందముగా గడుపుతారు. ఏలినాటి శని ప్రభావము ఉన్నప్పటికీ.. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాలయంలో విభూతితో శివునికి అభిషేకం చేయండి.

మీన రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆందోళన కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

టాపిక్