Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి-today horoscope in telugu based on career and life for 20th november 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 20th November 2022

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 20, 2022 04:30 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 20వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (20-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఘర్షణలు, మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. శుభఫలితాలు పొందడం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు, వ్యాపారస్తులకు ఒత్తిళ్లు ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం సాధిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మిధున రాశి

మిధున రాశివారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలంగా ఉంది. మానసిక వేదనలు, ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఏర్పడుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కానీ కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధన లాభము కలుగుతుంది. మరిన్ని శుభఫలితాల కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగుతాయి. కుటుంబము నందు కొన్ని సమస్యలు బాధిస్తాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించాలి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభములు కలుగుతాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం సూర్యాష్టకము పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందుతారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ప్రతీ విషయమునందు మానసిక వేదన, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబమునందు, ఉద్యోగ, వ్యాపారములనందు చికాకులు ఉంటాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి ఈరోజు అంత అనుకూలముగా లేదు. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబములో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా.. వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి.. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల పట్ల ఆచితూచి వ్యవహరించండి. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ధనలాభము, సౌఖ్యము కలుగుతుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కష్ట సమయము. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలముగా ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈరోజు కలసి వస్తుంది. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగుతారు. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఉన్న సమస్యలు తొలగుతాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కలసి వస్తుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం పఠిస్తే మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. కీర్తి, సౌఖ్యము కలుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం