Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారు రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉంటే మంచిది
Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 19వ తేదీ 2022న కెరీర్ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (19-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండదు. చికాకులు, ఆటంకములు, గొడవలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తగ్గించుకుంటే మంచిది. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, స్నేహితుల మధ్య స్పర్థలు వచ్చే అవకాశముంది. శుభఫలితాలు పొందడం కోసం శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారస్తులకు ఒత్తిడి ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా.. ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం సాధిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని, దుర్గాదేవిని పూజించండి.
మిధున రాశి
మిధున రాశివారికి ఈ రోజు మధ్యస్తముగా ఉంది. మానసిక వేదనలు, ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ధన లాభము కలుగుతుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబములోని సమస్యలు తగ్గుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కానీ ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణములు లాభిస్తాయి. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం మంచిది.
తులా రాశి
తులా రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ధన లాభము, సౌఖ్యము పొందుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రులు సహాయము చేస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలముగా ఉంటుంది. ముఖ్యమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికి అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఉన్నత అధికారుల మెప్పు పొందుతారు. సమాజంలో కీర్తి, కుటుంబంలో గౌరవము పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని పూజించండి మంచిది.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబములోని సమస్యలు తగ్గుతాయి. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభము, సౌఖ్యము, ఆనందము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయమిది. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, సౌఖ్యము పొందుతారు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఆరోగ్యము కుదుటపడుతుంది. మీ కృషితో ముందుకు వెళ్లి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు ఎక్కువగా ఉంటాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేయాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగుతారు. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు లాభము, సౌఖ్యము కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. కొంత కాలంగా ఉన్న సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయడం మంచిది.
మీన రాశి
మీన రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. శుభఫలితాలు పొందడం కోసం శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Contact : 9494981000
సంబంధిత కథనం
టాపిక్