Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారు రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉంటే మంచిది-today horoscope in telugu based on career and life for 18th november 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 18th November 2022

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారు రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉంటే మంచిది

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 18, 2022 04:30 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 18వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (18-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతీ పని శుభ ఫలితాన్నిస్తుంది. ఆర్ధిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎన్ని సమస్యలున్నా.. మీ తెలివితేటలతో ముందుకు సాగుతారు. కుటుంబంలోని సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభములు ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. బంధుమిత్రుల ప్రశంసలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకము, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.

మిథున రాశి

మిథున రాశివారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారము, ధన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. కృషితో ముందుకు సాగుతారు. చికాకులు ఎక్కువగా ఉంటాయి. శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కొన్ని సమస్యలు బాధిస్తాయి. అన్ని విధాలుగా ఈరోజు కలిసి వస్తుంది. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరింత శుభఫలితాలు పొందడం కోసం ఆవునేతితో దీపారాధన చేస్తూ లక్ష్మీదేవిని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శుభఫలితాలు పొందడం కోసం లక్ష్మీ అష్టకాన్ని పఠించి ఆవునేతితో దీపారాధన చేయడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రయాణములు లాభిస్తాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల పట్ల జాగ్రత్త వహించండి. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ప్రయాణములు అనుకూలిస్తాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం లలితా సహస్రనామాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ధనలాభము, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము కలుగుతుంది. సమాజంలో కీర్తి, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకం పఠించడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము కలుగుతుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభము, సౌఖ్యము, ఆనందము పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన కలుగుతుంది. శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శారీరక సౌఖ్యం కోసం ఖర్చు చేస్తారు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు మంచిగా ఉండదు. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు లాభము, సౌఖ్యము కలుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. కొంత కాలంగా ఉన్న సమస్యలు కొలిక్కి వస్తాయి. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్ర నామాన్ని పారాయణం చేయడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం