తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులు.. వ్యాపారస్తులకు ఒత్తిడి

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులు.. వ్యాపారస్తులకు ఒత్తిడి

24 November 2022, 5:00 IST

    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 24వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (24-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

Mars Transit : కుజుడి దయతో ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతాలు.. విక్టరీ మీ సొంతం

May 07, 2024, 04:07 PM

Shukraditya Raja yogam 2024: శుక్రాదిత్య రాజయోగం: ఈ రాశుల వారికి ఆదాయం పెరుగుదలతో పాటు చాలా లాభాలు

May 07, 2024, 03:43 PM

ఈ రాశుల వారికి టైమ్​ వచ్చింది- భారీ ధన లభాం, ఉద్యోగంలో ప్రమోషన్​.. అనుకున్నది సాధిస్తారు!

May 07, 2024, 05:50 AM

మే 7, రేపటి రాశి ఫలాలు.. రేపు వీరికి ఆదాయం ఫుల్, మనసు ఖుషీగా ఉంటుంది

May 06, 2024, 08:31 PM

Malavya Rajyog 2024: మాలవ్య రాజయోగం: ఈ రాశుల వారికి అదృష్టం! ఆర్థిక లాభాలతో పాటు మరిన్ని ప్రయోజనాలు

May 06, 2024, 04:49 PM

ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు! ఆర్థికంగా ఇబ్బందులు- జీవితంలో ఒడుదొడుకులు..

May 06, 2024, 09:45 AM

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఘర్షణలు, మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు కలుగుతాయి. ఖర్చులు అధికమగును. చేసే ప్రతి పనియందు జాగ్రత్త వహించండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల జాగ్రత్త వహించండి. మనస్తాపము, అనారోగ్యం కలిగే సూచనలున్నాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులు, వ్యాపారస్తులకు ఒత్తిడి కలిగే సూచనలున్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా.. ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం సాధిస్తారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

మిథున రాశి

మిథున రాశివారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలంగా ఉంది. మానసిక వేదనలు, ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఏర్పడతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మిధునరాశి వారికి ధన లాభము కలుగుతుంది. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉంటే మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితములు కలుగుతాయి. స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. కొన్ని సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభములు కలుగును. కుటుంబ సౌఖ్యము, ఆనందము పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. మానసిక వేదన, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబము, ఉద్యోగ, వ్యాపారముల్లో చికాకులు కలుగుతాయి. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. విరోధులతో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని ఆరాధించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి ఈరోజు అంత అనుకూలముగాలేదు. శారీరక శ్రమ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబములో వాగ్వివివాదాలు ఉంటాయి. సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉన్నప్పటికీ.. అనుకున్న పనిని పూర్తి చేస్తారు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని ఆరాధించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. మానసిక ఆందోళన కలుగుతుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ధనలాభము, సౌఖ్యము పొందుతారు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కష్ట సమయము. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. చేసే ప్రతి పనిని ఆచితూచీ జాగ్రత్తగా చేయండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలముగా ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కలసి వస్తుంది. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ.. ఏదో రకంగా ముందుకు సాగుతారు. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. ఆరోగ్యము అనుకూలిస్తుంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమగుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు దక్షిణామూర్తిని పూజించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు అనుకూలముగా ఉంది. ఆరోగ్య విషయల పట్ల జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000