తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 21st September 2022

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు : అనవసర విషయాలకు దూరంగా ఉండటమే ఆ రాశివారికి మంచిది

21 September 2022, 5:00 IST

    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? సెప్టెంబర్ 21వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (21-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారికి అహంకారం ఎక్కువ, వీరిటో మాట్లాడడం కష్టం

May 03, 2024, 04:29 PM

Ego Rasis: ఈ రాశుల వారికి కాస్త ఇగో ఎక్కువే.. ఎవరి మాట వినరండోయ్

May 03, 2024, 03:37 PM

Mercury : బుధుడి కారణంగా ఈ రాశులవారికి మంచి జరగనుంది

May 03, 2024, 03:30 PM

వృషభ రాశిలోకి గురువు.. ఈ రాశుల వారికి ధన లాభం- కానీ..

May 03, 2024, 05:35 AM

మే 3, రేపటి రాశి ఫలాలు.. రేపు భూమి, వాహనాలు కొనుగోలు చేసేందుకు అనువైన రోజు కాదు

May 02, 2024, 08:29 PM

Saturn retrograde: శని తిరోగమనం.. ఐదు నెలల వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు

May 02, 2024, 07:05 PM

మేష రాశిఫలం

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేస్తారు. ఖర్చులు అధికముగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు వచ్చే సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

వృషభ రాశిఫలం

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. సుఖ భోజన ప్రాప్తి కలుగుతుంది. శారీరక శ్రమ కొంత అధికముగా ఉంటుంది. మానసికంగా కూడా అలసిపోతారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

మిధున రాశిఫలం

ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉంటుంది. పిల్లల వలన చికాకులు ఉంటాయి. మీ కృషి చేత ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణమునందు ఖర్చులు అధికమవుతాయి. మిధునరాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

కర్కాటక రాశిఫలం

ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. శారీరక సౌఖ్యము పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగుతాయి. కొత్తగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

సింహ రాశిఫలం

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. సింహ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

కన్యా రాశిఫలం

ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నవి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కీర్తి కలుగుతుంది. ప్రయాణములు అధికమగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. ప్రతీ పనిలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. శరీర సౌఖ్యం కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. మానసికంగా ఆనందము పొందుతారు. ధనలాభము కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యము పెరుగుతుంది. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రుల ద్వారా సహాయము పొందుతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

వృశ్చిక రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నవి. శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. ఉద్యోగములో ఒత్తిడి, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. సోదరులు, పిల్లల వలన చికాకులు వస్తాయి. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ధనూ రాశిఫలం

ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితముగా ఉన్నది. మీరు చేసే ప్రతీ పనిలోనూ ఆచితూచి వ్యవహరించండి. శత్రువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. గొడవలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఇది. వ్యాపారంలో చికాకులు ఉంటాయి. మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

మకర రాశిఫలం

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. చికాకులు అధికముగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ వ్యవహరించండి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

కుంభ రాశిఫలం

ఈ రోజు మీకు మధ్యస్థము నుంచి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. కుటుంబంలోని వారితో ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారిపై తీవ్రముగా ఉన్నది. ప్రతీ పనిని ఆచితూచి వ్యవహరించవలసిన సమయము ఇది. శత్రువుల బాధలు అధికమవుతాయి. ఉద్యోగమునందు సమస్యలు ఎక్కువ అవుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

మీన రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీన రాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

టాపిక్