Today Horoscope : నేటి రాశిఫలాలు : వెంటాడే ఆర్థిక సమస్యలు.. పనుల్లో జాప్యం.. కారణం అదే-today horoscope in telugu based on career and life for 20th september 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 20th September 2022

Today Horoscope : నేటి రాశిఫలాలు : వెంటాడే ఆర్థిక సమస్యలు.. పనుల్లో జాప్యం.. కారణం అదే

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 20, 2022 05:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? సెప్టెంబర్ 20వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Horoscope : నేటి రాశిఫలాలు (20-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మేష రాశిఫలం

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. జన్మ రాహువు, వాక్ స్థానము నందు కుజగ్రహ ఉంది కాబట్టి గొడవలకు దూరంగా ఉండండి. కుటుంబములో చికాకులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ ప్రతీ పనిని పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వ్యయ స్థానములో గురు సంచారము ఉంటుంది కాబట్టి.. ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది. విద్యార్థులకు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.

వృషభ రాశిఫలం

వృషభరాశి వారికి ఈరోజు మధ్యస్త ఫలితాలు ఉన్నవి. కుజుని ప్రభావం చేత ఆరోగ్య విషయంలో, కుటుంబ వ్యవహారములలో చికాకులు ఉంటాయి. శారీరక శ్రమ కొంత అధికముగా ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో బేధాభిప్రాయాలు పెరుగుతాయి. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము ఉంటుంది.

మిథున రాశిఫలం

మిధునరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. ధనలాభము, సౌఖ్యము కలుగును. శుక్రుడు, బుధుడు అనుకూల స్థితి వలన కుటుంబ సౌఖ్యము, ధన లాభము కలుగును. కుజుని ప్రభావంచేత ఆవేశపూరిత నిర్ణయాలు, వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొంత డబ్బును మానసిక ఉల్లాసము కోసం ఖర్చు చేస్తారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. మిధునరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.

కర్కాటక రాశిఫలం

కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. గురు, కుజ, రాహు గ్రహాల అనుకూల ప్రభావం వల్ల.. అలాగే శని అనుకూలత వలన మీకు అన్ని విధాలుగా ఈ వారం కలిసి వస్తుంది. చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబంలోని సమస్యలు తొలగుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లటం మంచిది. దుర్గాష్టకము దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

సింహ రాశిఫలం

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. ద్వితీయ స్థానములో రవి, బుధుల సంచారము వలన ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు, కొత్త వ్యవహారాల్లో పాల్గొనేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం ఇది. దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే.. మరిన్ని శుభ ఫలితములు ఉంటాయి.

కన్య రాశిఫలం

కన్యారాశి వారికి ఈరోజు మధ్యస్తంగా ఉంది. జన్మరాశిలో రవి సంచరించుట వల్ల ఒత్తిడి అధికముగా ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. శని, గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రయాణములు ఎక్కువ అవుతాయి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. దుర్గాదేవిని పూజించి.. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

తుల రాశిఫలం

తులారాశి వారికి మధ్యస్తముగా ఉంటుంది. జన్మరాశిలో కేతువు అష్టమ స్థానంలో కుజుడు, శత్రు స్థానంలో నందు గురుని సంచారం వలన తులారాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. శత్రువులు పెరుగుతారు. కుటుంబం వల్ల మానసిక ఒత్తిడి, ఇబ్బందులు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. స్త్రీలకు కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పుల ఒత్తిడి ఉంటుంది. దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచి జరుగుతుంది.

వృశ్చిక రాశిఫలం

వృశ్చికరాశి వారికి అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి, కుటుంబంలో గౌరవము పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభాలు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగుతుంది.

ధనుస్సు రాశిఫలం

ధనూరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితములు ఉన్నాయి. శుక్రుని సంచారము వలన అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయమిది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావము వల్ల ఆర్ధిక సమస్యలు, పనుల్లో ఆలస్యము ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన కలుగును. దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే శుభ ఫలితములు కలుగును.

మకర రాశిఫలం

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయినా సరే మీ కృషితో, పట్టుదలతో ముందుకు వెళ్లి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికంగా ఉంటాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి.

కుంభ రాశిఫలం

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థము నుంచి చెడు ఫలితాలు అధికముగా ఉంటాయి. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ధన వ్యయము, ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. అప్పులు చేస్తారు. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు కష్టకాలము. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండదు. పనుల్లో ఆచితూచి వ్యవహరించండి. శత్రువుల వల్ల బాధలు ఎక్కువ అవుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుట వలన మరిన్ని శుభ ఫలితములు కలుగుతాయి.

మీనం రాశిఫలం

మీన రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి అధికముగా ఉంటుంది. ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కానీ మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్