తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 23, నేటి రాశి ఫలాలు.. ఈ వ్యాపారాలు చేసే వారికి పురోభివృద్ది, లాభాలు

ఏప్రిల్ 23, నేటి రాశి ఫలాలు.. ఈ వ్యాపారాలు చేసే వారికి పురోభివృద్ది, లాభాలు

Gunti Soundarya HT Telugu

23 April 2024, 0:01 IST

google News
  • Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 23.04.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 23వ తేదీ నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 23వ తేదీ నేటి రాశి ఫలాలు (pinterest)

ఏప్రిల్ 23వ తేదీ నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 23.04.2024

లేటెస్ట్ ఫోటోలు

2025లో కుజుడి వల్ల ఈ రాశులవారికి పట్టిన దరిద్రం అంతా పోయే అవకాశం!

Dec 22, 2024, 10:18 PM

ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం- ఆర్థిక కష్టాలు దూరం, ఉద్యోగంలో ప్రమోషన్​

Dec 22, 2024, 12:06 PM

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

వారం: మంగళవారం, తిథి : పౌర్ణమి,

నక్షత్రం : చిత్తా, మాసం : చైత్రం,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి ఉంటుంది. ఒంటరిగా ఏ పని చేయటం క్షేమం కాదని గమనించండి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిత్రార్జిత ఆస్తిని అమ్మటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు అదనపు సంపాదన దిశగా తమ ఆలోచనలు సాగిస్తారు. తరచూ దేవాలయ సందర్శనం చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సిమెంటు, ఇసుక వ్యాపారులకు పురోభివృద్ధి. ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నడుపుతారు. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి. వ్యాపారాల్లో అనుభవం, ఆశించిన లాభాలు గడిస్తారు. మీ భర్తలో ఉన్నట్టుండి వేదాంత ధోరణి కనిపిస్తుంది. హోల్‌సేల్‌ వ్యాపారులు, రేషన్‌ మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. స్టేషనరీ, ప్రింటింగ్‌ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. చేపట్టిన పనులలో నాణ్యతా లోపం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బందులెదుర్కోవాల్సి వస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి ఉంటుంది. మరింత శుభ ఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్త్రీలు టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తున్నాను. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. మీ వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకోగలుగుతారు. ప్రభుత్వ కార్యలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బంధువులతో అభిప్రాయభేదాలు, పట్టింపులు తలెత్తుతాయి. సామూహిక దైవకార్యక్రమాల శక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ప్రతి విషయంలోను మౌనం వహించడం మంచిది. బ్యాంకు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. ప్రేమికులకు తొందరపాటు తగదు. మరింత శుభఫలితాలు పొందాలంటే సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఒక కార్యసాధన కోసం ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి ఉంటుంది. గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ విషయంలో కూడ మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. అనవసర విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాలు మీచేతుల మీదుగా సాగుతాయి. మరింత శుభ ఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలం. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. రచయితలు, పత్రికా రంగంలోని వారికి కళారంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆసక్తి చూపిస్తారు. వృత్తి వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యహరించడం వల్ల సత్ఫలితాలు సాధిస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. పనులు హడావుడిగా సాగుతాయి. పంతాలు, పట్టింపులకు ఇది సమయం కాదు. మీ మనోభావాలు బయటికి వ్యక్తం చేసి సమస్యలు తీర్చుకోగలుగుతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్న వారికి అనుకూలమైన కాలం. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. భాగస్వాముల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల సమయం. పాతమిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం. వ్యాపార విషయంగా ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరున్ని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలకు అనుకూలమైన కాలం. ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడి, ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం