ఏప్రిల్ 22, నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వాళ్ళు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి-april 22nd 2024 today rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 22, నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వాళ్ళు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి

ఏప్రిల్ 22, నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వాళ్ళు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి

HT Telugu Desk HT Telugu
Apr 22, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ22.04.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 22వ తేదీ నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 22వ తేదీ నేటి రాశి ఫలాలు (pixabay )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 22.04.2024

వారం: సోమవారం, తిథి : చతుర్దశి,

నక్షత్రం : హస్త, మాసం : చైత్రం,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. దుబారా ఖర్చులు అధికమవుతాయి. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు, మార్పులు చేర్పులకు అనుకూలం. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు. మీ పనులు మందకొడిగా సాగుతాయి. మేష రాశివారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు, ధనమును పొందెదరు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రముఖులతో తరచూ సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభ ఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆర్థిక వ్యాపార విషయాలు రహస్యంగా ఉంచండి. శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుండి బయటపడతారు. మీ అజాగ్రత్త వల్ల పత్రాలు విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. మిథున రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

కర్కాటక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచి శ్రమించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తినా లాభదాయకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సలహాతో ఒక సమస్య నుంచి బయటపడతారు. స్త్రీలు షాపింగ్‌ కోసం ధనం ఖర్చు చేస్తారు. సంగీత, సాహిత్య కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కర్కాటక రాశి వారికి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన, పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. విదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు వాయిదాపడతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. సింహ రాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం సాధిస్తారు. అవగాహన లేని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా పాటించండి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. క్రయవిక్రయాలు జోరుగా సాగుతాయి. కన్యా రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బేకరీ, స్వీట్లు, పూల, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు ఫైనాన్సులో పొదుపుచేయడం మంచిది కాదని గమనించండి. తలపెట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. విద్యార్థులు వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. తులా రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ప్రైవేటు ఫైనాన్సులో పొదుపు చేయడం మంచిది కాదని గమనించండి. రాజకీయ నాయకులకు ప్రయాణాలో మెళకువ అవసరం. స్త్రీల అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచటం మంచిది. వృశ్చిక రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ కదలికలపై కొంతమంది నిఘా వేస్తారన్న విషయాన్ని గమనించండి. ధనూ రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. కొత్త వ్యక్తులను దరిచేరనీయకండి. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కార మార్గం గోచరిస్తుంది. స్త్రీలకు గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. అర్థాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. దూరప్రయాణాలు విసుగు కలిగిస్తాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. కుంభ రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబీకులకు, బంధువుల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతాయి. స్త్రీలపై శకునాలు, చుట్టుపక్కలవారి వ్యాఖ్యలు తీవ్రప్రభావం చూపుతాయి. వాణిజ్య ఒప్పందాలు, సంతకాలు, హామీల విషయంలో ఏకాగ్రత అవసరం. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel