తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Heaven Steps: స్వర్గానికి మెట్లు ఈ మార్గం.. ఇక్కడ జలపాతం నీరు పాపం చేసిన వారి మీద పడదు

Heaven steps: స్వర్గానికి మెట్లు ఈ మార్గం.. ఇక్కడ జలపాతం నీరు పాపం చేసిన వారి మీద పడదు

Gunti Soundarya HT Telugu

05 June 2024, 16:22 IST

google News
  • Heaven steps: ఉత్తరాఖండ్ లోని ఈ ప్రదేశం స్వరానికి మెట్లుగా చెప్తారు. ఇక్కడ నుంచి స్వర్గానికి చేరుకోవచ్చని చెప్తారు. ఈ ప్రాంతం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. 

స్వర్గానికి మెట్లు ఈ మార్గం
స్వర్గానికి మెట్లు ఈ మార్గం (pinterest)

స్వర్గానికి మెట్లు ఈ మార్గం

Heaven steps: హిందూమతంలో స్వర్గానికి వెళ్లడం అంటే అంతిమ విముక్తిగా భావిస్తారు. ఒక వ్యక్తి ప్రాపంచిక కోరికలతో వారు బంధాలను తెంచుకున్నాడని, మోక్షాన్ని పొందుతారని సూచిస్తుంది. స్వర్గం అంటే అందం, శాంతి, సంతోషాలకు ప్రదేశంగా భావిస్తారు.  ఇది దుఃఖాలు, పోరాటాల నుండి విముక్తిని ఇస్తుంది. అన్ని కోరికల నుండి దూరం చేస్తుంది. మంచి కర్మల ఫలాలను అనుభవించే చోటు స్వర్గం అని అమ్ముతారు. అటువంటి స్వర్గానికి వెళ్లే మార్గం భూమి మీద ఒకటి ఉందని చాలామంది విశ్వసిస్తారు. అదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్గారోహిణి పర్వతం. 

లేటెస్ట్ ఫోటోలు

CM Ravanth Reddy : ఇతర మతాలను కించపరిచే చర్యలను ప్రభుత్వం సహించదు- సీఎం రేవంత్ రెడ్డి

Dec 21, 2024, 11:48 PM

No expiry date foods: ఈ ఆహార పదార్ధాలకు ఎక్స్పైరీ డేట్ లేదు.. తెలుసా..?

Dec 21, 2024, 10:18 PM

Bajaj Chetak EV: సరికొత్త అవతారంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్

Dec 21, 2024, 09:50 PM

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వెంక‌టేష్ - సంక్రాంతి సంద‌డి ముందుగానే!

Dec 21, 2024, 07:46 PM

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

పాండవులు ఇక్కడి నుంచే వెళ్లారు

కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులో తమ రాజరిక స్థితిని త్యజించి తపస్సు చేసుకోవడానికి బయలుదేరారు. వాళ్లు అడవి వైపు నడిచిన ప్రయాణాన్ని మహాప్రస్థానం అని పిలుస్తారు. ఇది స్వర్గారోహిణికి దారితీస్తుంది. 

పురాణాల ప్రకారం పాండవులు తమ అంతిమ ప్రయాణాన్ని మన అనే గ్రామం నుంచి ప్రారంభించారు. వారి చేసిన పాపాల కారణంగా ఒక్కొక్కరు మరణిస్తూ వచ్చారు. ద్రౌపది అర్జునుడిపై ఉన్న ప్రేమ కారణంగా మరణించింది. ఇక భీముడు తన తిండిబోతుతనంతో మరణించాడని చెబుతారు.

ఈ మన గ్రామం టిబెట్ సరిహద్దుకు ముందు ఉన్న చివరి భారతీయ గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామం అందమైన ఆధ్యాత్మికమైన ట్రెక్కింగ్ కి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడ ఉన్న వాటిలో ప్రత్యేకమైనది ఈ స్వర్గారోహిణి పర్వతం. కథలు,  ఇతిహాసాల ప్రకారం పాండవులు స్వర్గానికి ప్రయాణం ప్రారంభించి ఈ గ్రామం ద్వారానే పైకి వెళ్లారని చెబుతారు. ఈ గ్రామంలో వ్యాస గుహ, గణేష్ గుహ అనే రెండు ప్రసిద్ధి చెందిన గుహలు ఉన్నాయి. ఇక్కడ వ్యాసమహర్షి గణేషుడి సహాయంతో మహాభారతాన్ని రచించాడని పురాణాలు చెబుతున్నాయి. 

భూతల స్వర్గం అంటే ఇలానే ఉంటుందేమో అనే విధంగా స్వర్గారోహిణి ఉంటుంది. ఓవైపు హిమానీనదం దాని వైపు ట్రెక్కింగ్ చాలా అందంగా ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని అత్యంత ప్రసిద్ధ చెందిన ప్రదేశాలలో ఇది ఒకటి. స్వర్గారోహిణి ట్రెక్కింగ్ అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక సాఫల్యం హిమాలయాల పులకింతలను కోరుకునే ఉత్సాహికులు,  సాహసికులు ఈ  ప్రాంతానికి రావడానికి ఆసక్తి చూపిస్తారు. స్వర్గారోహణ శిఖరాలు అంటే స్వర్గానికి మెట్లు అని నమ్ముతారు. ఈ శిఖరం ప్రయాణం దైవికమార్గం వైపు ఆత్మ ప్రయాణాన్ని సూచిస్తుంది. 

వసుధార జలపాతం

స్వర్గారోహిణి శిఖరం ఎక్కే దారిలో ఒక జలపాతం కనిపిస్తుంది. దీని వెనక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. వసుధార ప్రాంతం అంతా చాలా ప్రసిద్ధి చెందినది. ఈ జలపాతం చాలా స్వచ్ఛమైనది, పవిత్రమైనదని చెబుతారు. ఈ జలపాతం నీళ్లు పాపం చేసిన వ్యక్తుల శరీరంపై పడవని అంటారు. పాండవ సోదరులలో ఒకడైన సహదేవుడు వసుధార జలపాతం దగ్గర తపస్సు చేసి మరణించాడు అని అంటారు.  ఈ జలపాతం నీరు మనిషిని తాకితే ఆ నీటిలో అష్ట వసుస్ ఉన్నందున వారు అనేక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారని కూడా చెబుతారు.

 

నమ్ముతారు ఈ నీటిలో అష్టవసస్సు ఉందని చెబుతారు

తదుపరి వ్యాసం