Best Trekking Places : కొండ కోనల్లో సాహసాలకు సిద్ధమా? బెస్ట్ ట్రెక్కింగ్ ప్రదేశాలివే!
Best Trekking Places : మీకు అడ్వెంచర్ అంటే ఇష్టమా? అడవుల్లో, సెలయేర్ల మార్గంలో, పచ్చటి కొండల్లో ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే దేశంలో ఉత్తమ ట్రెక్కింగ్ ప్రాంతాలను తెలియజేస్తున్నాం.
Best Trekking Places : హాట్ సమ్మర్ లో కూల్ ప్లేసెస్ లో ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్నారు. ప్రకృతితో మమేకం అవుతూ ఈ బిజీ లైఫ్ సమస్యలను కాసేపు మర్చిపోవాలనుకుంటున్నారా? అయితే దేశంలో బెస్ట్ ట్రెక్కింగ్ ప్రదేశాలు మీకు తెలియజేస్తున్నాం. మీ మొదటి అవుట్‌డోర్ సాహసాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? చక్కని ట్రెక్కింగ్ ప్రయాణం కోసం దేశంలోని అద్భుతమైన, అనుకూలమైన ట్రెక్‌ల కోసం చూస్తున్నారా? అయితే కర్ణాటకలోని సావన్ దుర్గ ట్రెక్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా కొండను జయించడానికి మీరు సిద్ధం అవ్వండి. ఉత్తరాఖండ్‌లోని నాగ్‌టిబ్బా ట్రెక్‌లో రోడోడెండ్రాన్ పూలతో అలంకరించిన మార్గాల్లో అడవుల గుండా ట్రెక్కింగ్ చేయడానికి, మహారాష్ట్రలోని వసోటాఫోర్ట్ ట్రెక్ లో మీరు విభిన్నమైన వన్యప్రాణులను వీక్షించడానికి రెడీ అవ్వండి.
ట్రెక్కింగ్ కొత్తగా ప్రారంభించేవారి ఉత్తమ ట్రెక్ ప్రాంతాలు
- ఉత్తరాఖండ్ లోని కేదారకంఠ ట్రెక్ , దయారా బుగ్యాల్ ట్రెక్,
- హిమాచల్ ప్రదేశ్ లోని కరేరి లేక్ ట్రెక్, త్రివుండ్ ట్రెక్
- మహారాష్ట్రలోని మథెరన్ ట్రెక్ , వసోటా ఫోర్ట్ ట్రెక్
- కర్ణాటకలోని కుద్రేముఖ్ ట్రెక్, సావన్ దుర్గ ట్రెక్
సావన్ దుర్గ ట్రెక్ : సావన్‌దుర్గ ట్రెక్ ఆసియాలోని అతిపెద్ద ఏకశిలా కొండపైకి వెళ్లే మార్గంలో సాగుతోంది. బెంగుళూరు నుంచి 60 కి.మీ దూరంలో సావన్ దుర్గ ఉంది. అటవీప్రాంతంలో ఉన్న ట్రెక్కింగ్ మార్గం, మగాడి, మంచబెలె, తిప్పగొండనహళ్లి రిజర్వాయర్‌లు, అర్కావతి నది అద్భుతమైన దృశ్యాలు, ట్రెక్కింగ్ సవాలుతో కూడిన మార్గంగా ప్రసిద్ధి. కరిగుడ్డ (నల్లటి కొండ), బిలిగుడ్డ (తెల్లటి కొండ) అని సావన్ దుర్గ కొండల సమూహాన్ని పిలుస్తారు. సావన్ దుర్గ మార్గంలో రెండు దేవాలయాలు ఉన్నాయి. సావండి వీరభద్రస్వామి దేవాలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇక్కడకి కర్ణాటకలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. రాతి కొండ మార్గాలు, అడవులు, గుహల మధ్య నడకమార్గం అద్భుతంగా ఉంటుంది. అత్యంత అద్భుతమైన సూర్యోదయాన్ని వీక్షించడానికి మీరు ఉదయం 5 గంటలకు ట్రెక్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది.
కుద్రేముఖ్ ట్రెక్ - కుద్రేముఖ్ అంటే కన్నడలో గుర్రపు ముఖం అని అర్థం వస్తుంది. ఈ శిఖరం విలక్షణమైన ఆకృతి కారణంగా ఈ పేరు వచ్చిందంటారు. ఈ కొండకు సంసే గ్రామం నుంచి చేరుకునే అవకాశం ఉండడంతో దీనిని సంసేపర్వత్ అని కూడా పిలుస్తారు. కుద్రేముఖ్ కొండ చిక్కమగళూరు జిల్లాలో పశ్చిమ కనుమలలో ఉంది. పశ్చిమ కనుమలలో రెండో అతిపెద్ద వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతం అయితే కుద్రేముఖ్ నేషనల్ పార్క్ లో భాగంగా ఉంది. ఈ కొండ 6,207 అడుగుల ఎత్తులో ఉంది. ముల్లయ్యంగిరి, బాబా బుడంగిరి పర్వతాల తర్వాత కర్ణాటకలో 3వ ఎత్తైన శిఖరం కుద్రేముఖ్.
కుద్రేముఖ్ లో అనేక వృక్షాలు, జంతులకు నిలయం. మీరు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మధ్యదారిలో జింకలు, నెమళ్లను కూడా చూడవచ్చు. పచ్చని కొండలు, పొగమంచు లోయల మీదుగా సాగే అందమైన ట్రెక్ ఇది. గడ్డి భూములు, అడవిలో అనేక చిన్న ప్రవాహాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది.
ఎలా చేరుకోవాలి?
మీరు బెంగుళూరు నుంచి సొంత వాహనంలో వస్తే కలసా చేరుకోవాలి. కలసా చేరుకోవడానికి బెంగళూరు నుంచి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హసన్ మీదుగా వెళ్లడం ఉత్తమ మార్గం. చిక్కమగళూరు రహదారిలో వెళ్లి కొట్టిగెహర జంక్షన్ వద్ద కలసా వైపు వెళ్లేందుకు కుడివైపునకు వెళ్లండి. మీరు కలసా పోలీస్ స్టేషన్‌కు చేరుకునే వరకు అదే మార్గంలో కొనసాగండి. కుద్రేముఖ్ ప్రవేశ ద్వారం చేరుకోవడానికి పోలీస్ స్టేషన్ జంక్షన్ నుంచి బలగల్ వైపు ఎడమవైపు వెళ్లాలి.
సంబంధిత కథనం