Saturn transit: 2025లో ఈ రాశి వారికి శని సడే సతీ నుంచి విముక్తి.. వీళ్ళు 2028 వరకు వేచి ఉండాలి
Saturn transit: కొన్ని రాశుల వారికి శని సడే సతీ నుంచి 2025 లో విముక్తి కలగబోతుంది. వీరికి మాత్రం 2028 వరకు శని బాధలు తప్పవు. అవి ఏ రాశులో చూసేయండి.
Saturn transit: కర్మల అనుసారం ఫలితాలని ఇచ్చేవాడు శని. ఈ ఏడాది మొత్తం కుంభ రాశిలోనే సంచరిస్తాడు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత శని తన సొంత రాశిలో ప్రయాణిస్తున్నాడు.
త్వరలో కుంభ రాశిలో తిరోగమన దిశలో ప్రయాణిస్తాడు. అయితే శని వ్యతిరేక దిశలో కదలడం వల్ల కొన్ని రాశుల వారికి కష్ట సమయాన్ని తెచ్చిపెడుతుందని చెబుతారు. కష్టాలు భరించాల్సి వస్తుంది. శని ప్రభావంతో వారి జీవితంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి.
వీరికి సడే సతీ నుంచి విముక్తి
చెడు పనులు చేస్తే కష్టాలు, మంచి పనులు చేస్తూ దాతృత్వ కార్యక్రమాలు చేసే వారికి శుభ ఫలితాలను శని ఇస్తాడు. అందుకే శనిని న్యాయదేవుడిగా పిలుస్తారు. శని ఒక రాశి చక్రంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. శని ఉంటున్న రాశికి ముందు, వెనక ఉన్న రాశులపై అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. శని మహాదశ, సడే సతి, దయ్యా అనేవి శని ప్రత్యేక దశలు. 2025వ సంవత్సరంలో శని తన రాశి చక్రాన్ని మారుస్తాడు. మే 2025 తర్వాత శని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.
శని తన రాశిని మార్చుకోవడం వల్ల 2025 సంవత్సరంలో సడే సతి ప్రభావం మకర రాశి నుంచి ముగుస్తుంది. మీన రాశిలో శని సంచారం జరుగుతున్న సమయంలో మకర రాశి జాతకులు ఏలినాటి శని నుంచి విముక్తి కలుగుతుంది. కుంభ రాశిపై శని సడే సతి ప్రభావం మొదలవుతుంది. దీని ఫలితంగా అనేక రకాల సమస్యలు వెంటాడతాయి. 2028 జనవరి 23న శని సడే సతి పూర్తిగా కుంభ రాశి నుంచి తొలగిపోతుంది.
శని తిరోగమన ప్రభావాలు
జూన్ 29 నుంచి శని తిరోగమంలో ఉంటాడు. ఇది అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. ఏ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిదో తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి వారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని దేవుడికి ఇష్టమైన పదార్థాలు దానం చేయడం మంచిది. అసలు అహంకారం ప్రదర్శించకూడదు. ఎవరి పట్ల దుర్భాషలాడకూడదు.
వృషభ రాశి: శని ప్రభావంతో వృషభ రాశి వారికి ఉద్యోగంలో సమస్యలు ఉండవచ్చు. అందువల్ల మీ మాటలను నియంత్రించుకోవాలి. పరుష పదజాలం ఉపయోగించకూడదు.
మిథున రాశి: శని తిరోగమన సమయంలో మిథున రాశి వారు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టే ముందు అప్రమత్తంగా ఉండాలి. లావాదేవీలు చాలా జాగ్రత్తగా చేయాలి.
కర్కాటక రాశి: శని తిరోగమన దశ కర్కాటక రాశి వారికి ఒత్తిడి సమయాన్ని ఇస్తుంది. కష్టపడి పని చేయాలి. అలాగే కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
సింహ రాశి: ఈ రాశి వారికి శని తిరోగమనం కలిసి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: శని ప్రభావంతో వృశ్చిక రాశి వారికి ఆకస్మిక లాభాలు ఉండవచ్చు. అయితే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం మంచిది.
ధనుస్సు రాశి: ఈ రాశి జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శని చెడు ప్రభావంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి: శని తిరోగమన కాలంలో మకర రాశి జాతకులు కష్టపడి పనిచేయాలి. ఏ పనిని వాయిదా వేయకూడదు. అలా చేయడం వల్ల తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
కుంభ రాశి: ఈ రాశి వారి మీద సడే సతి ప్రభావం ఉంటుంది. అందువల్ల శని కదలిక పట్ల జాగ్రత్త వహించాలి. ఎవరైనీ ఒప్పించకూడదు.
మీన రాశి: శని ప్రభావంతో ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది.