Rahu nakshtra transit: శని నక్షత్రంలోకి రాహువు.. ఈ నాలుగు రాశులకు అదృష్టం, డబ్బు ఆదా చేస్తారు
Rahu nakshtra transit: నీడ గ్రహంగా పరిగణించే రాహువు శనికి చెందిన నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా నాలుగు రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. డబ్బు ఆదా చేయగలుగుతారు.
Rahu nakshtra transit: జ్యోతిష శాస్త్రంలో రాహువు అన్ని గ్రహాలలో చాలా ప్రత్యేకమైనది. నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణిస్తారు. సుమారు 18 నెలల పాటు ఒకే రాశిలో సంచరిస్తాడు.
రాహు సంచారం అందరి జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఏడాది రాహువు తన రాశిని మార్చుకోకపోయినప్పటికీ నక్షత్రాన్ని మార్చుకుంటున్నాడు. ప్రస్తుతం రాహువు బుధుడికి చెందిన రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. జులై 8న రాహువు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది మొత్తం 12 రాశి చక్ర సంకేతాలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది
ఉత్తరాభాద్రపద నక్షత్ర ప్రాముఖ్యత
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తరాభాద్రపడ నక్షత్రానికి అధిపతి శని. ఈ నక్షత్రానికి చెందిన జాతకులు ఆకర్షణీయమైన రూపం, ఆహ్లాదకరమైన మాట స్వభావం కలిగి ఉంటారు. తమ చిరునవ్వుతోనే ఎదుటి వారిని ఆకర్షించగలుగుతారు. చాలా పరిజ్ఞానం, తెలివితేటలు కలిగి ఉంటారు. ఎవరి పట్ల ఎటువంటి వివక్ష చూపించరు. ఇతరుల బాధను తమ బాధగా భావిస్తారు. అయితే వీరికి కాస్త కోపం ఎక్కువ. కొన్ని సార్లు నియంత్రణ కోల్పోయి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఉత్తరాభాద్రపద నక్షత్రంలో రాహు సంచారం ఎవరికి అనుకూల ఫలితాలు ఇస్తుందో చూద్దాం.
కర్కాటక రాశి
రాహు నక్షత్ర మార్పు కర్కాటక రాశి వారికి చాలా ఫలవంతమైనదిగా ఉంటుంది. విదేశాలకు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి .పెండింగ్లో ఉన్న అన్ని పనులు సులభంగా పూర్తి చేస్తారు. అదృష్టం పెరుగుతుంది. తద్వారా పెట్టిన పెట్టుబడులపై లాభాలు కలుగుతాయి. కార్యాలయంలో మీ పనితనానికి ప్రశంసలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం లభిస్తుంది. పొదుపు చేయగలుగుతారు. ఉన్నతాధికారులతో మీ మాట తీరు అద్భుతంగా ఉంటుంది. భాగస్వామితో సంబంధం ప్రేమతో నిండి ఉంటుంది. ప్రతి క్షణం ఆస్వాదిస్తూ గడుపుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
తులా రాశి
రాహు సంచారం తులా రాశి వారికి శుభ సమయం అవుతుంది. కెరీర్ లో వారు చేసే ప్రయత్నాలు అన్ని అగ్ర ఫలితాలను ఇస్తాయి. మీ పని తీరు ప్రశంసనీయంగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి .ఈ కాలంలో ప్రమోషన్, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితాన్ని బలోపేతం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు ఉంటాయి .పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పరంగా డబ్బు సంపాదించేందుకు, పొదుపు చేసేందుకు ఇది తగిన కాలం. వివిధ వనరుల నుండి డబ్బు సంపాదించేందుకు కొత్త అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు నుంచి బయటపడతారు.
మకర రాశి
ఉత్తరభాద్రపద నక్షత్రంలో రాహు సంచారం మకర రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో భౌతిక సుఖాలు పెరుగుతాయి. వివిధ కారణాల వల్ల విదేశాలకు కూడా వెళతారు. అదృష్టం అండగా ఉంటుంది .విశ్వాసం ధైర్యం పెరుగుతాయి .ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. మనసుకు సంతోషం కలుగుతుంది. ఆస్తి కొనుగోలు లేదా పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామి పూర్తి మద్దతు పొందుతారు .లాభాలు సంపాదించేందుకు ఇది ఉత్తమ సమయం . మునుపటి కంటే ఎక్కువ డబ్బు ఆదా చేసుకోగలుగుతారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి రాహు సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కెరీర్ లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. పనిలో ఆనందం శ్రేయస్సు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారవేత్తలు కెరీర్ లో అపారమైన విజయాన్ని అందుకుంటారు. డబ్బు సంపాదించేందుకు ఉత్తమ సమయం. ప్రేమ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది. భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉంటారు. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది.