కార్టిసాల్ హార్మోన్ ను కిడ్నీలపై ఉండే అడ్రినల్ గ్రంథులు స్రవిస్తాయి. ఇవి ఒత్తిడికి మీ శరీర ప్రతిస్పందనను నియంత్రిస్తాయి. అందుకే కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం. కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి 9 చిట్కాలు తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad May 25, 2024
Hindustan Times Telugu
వ్యాయామం - రెగ్యులర్ గా వ్యాయామం చేయడం కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సాయపడుతుంది. వాకింగ్, జాగింగ్ , యోగా కనీసం 30 నిమిషాల వ్యాయామం లక్ష్యంగా పెట్టుకోండి.
pexels
బాగా నిద్రపోవడం- సరైన నిద్ర లేకపోవడం కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ప్రతి రోజు 7-9 గంటల నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం. నిద్ర నాణ్యతను పెంచేందుకు సరైన దినచర్య పాటించండి.
pexels
ఒత్తిడిని తగ్గించుకోండి - కార్టిసాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. మీరు ఒత్తిడికి గురై అంశాలు గుర్తించి, వాటిని నియంత్రించుకోండి.
pexels
శ్వాస వ్యాయామాలు - శ్వాస మీద ధ్యాస, లోతుగా శ్వాస తీసుకోవడం నెమ్మదిగా వదలడం వంటి శ్వాస వ్యాయామాలు ప్రాక్టీస్ చేయండి.
pexels
ఆరోగ్యకరమైన ఆహారం- పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్ లతో కూడిన ఆహారం తీసుకుంటే కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతాయి. అధిక కెఫిన్, షుగర్ ను నివారించండి.
pexels
నవ్వడం - నవ్వు ఎండార్పిన్ల వంటి సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి కార్టిసాల్ ఒత్తిడి హార్మోన్లను కంట్రోల్ చేస్తాయి. నవ్వడం మానసిక స్థితిని ప్రోత్సహించి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
pexels
అభిరుచి - మీకు ఒత్తిడిని కలిగించే వాటిపై కాకుండా మనస్సు ప్రశాంతతను పెంచే వాటిపై దృష్టి పెట్టండి. కొత్త జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ఉత్తమ మార్గాలను అనుసరించండి.
pexels
పెంపుడు జంతువులతో సమయం- పెంపుడు జంతువులతో సరదాగా గడపడం వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. విశ్రాంతిని ప్రోత్సహించే ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది.
pexels
శీతాకాలం వచ్చేస్తోంది- వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి..