Saturn retrograde: శని తిరోగమనం.. 139 రోజుల పాటు ఈ రాశుల వారికి ఇబ్బందులు తప్పవు, జాగ్రత్తగా ఉండాలి-saturn retrograde in kumbh rashi these zodiac signs get face troubles 139 days ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Retrograde: శని తిరోగమనం.. 139 రోజుల పాటు ఈ రాశుల వారికి ఇబ్బందులు తప్పవు, జాగ్రత్తగా ఉండాలి

Saturn retrograde: శని తిరోగమనం.. 139 రోజుల పాటు ఈ రాశుల వారికి ఇబ్బందులు తప్పవు, జాగ్రత్తగా ఉండాలి

Gunti Soundarya HT Telugu
May 19, 2024 09:00 AM IST

Saturn retrograde: శని త్వరలోనే తిరోగమన దశలో సంచరించబోతున్నాడు. ఫలితంగా 139 రోజుల పాటు కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తప్పవు. చాలా జాగ్రత్తగా ఉండాలి.

శని తిరోగమనం వీళ్ళు జాగ్రత్త
శని తిరోగమనం వీళ్ళు జాగ్రత్త

Saturn retrograde: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మ, ధర్మాన్ని ప్రేమించే శని సుమారు 18 నెలల తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి మారతాడు. 2024వ సంవత్సరంలో శని రాశి మార్చుకోడు. ఏడాది పొడవునా తన సొంత రాశి అయిన కుంభ రాశిలో కూర్చుంటాడు.

హిందూ క్యాలెండర్ ప్రకారం జూన్ 30 అర్ధరాత్రి నుంచి శని కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరిస్తాడు. 139 రోజులపాటు తిరోగమన స్థితిలో ఉంటాడు. ఆ తర్వాత నవంబర్ 15న కుంభ రాశిలో ప్రత్యక్ష సంచారం చేస్తాడు.

జూన్ చివరిలో శని తన కదలికను మార్చుకొని కొన్ని రాశులకు శుభ ఫలితాలు ఇస్తాడు. అయితే ఇది కొన్ని రాశుల వారికి మాత్రం కష్టాలను పెంచుతుంది. శని తిరోగమన కదలికతో ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

మేష రాశి

శని తిరోగమన దశ వల్ల మేష రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. మనసు అశాంతిగా ఉంటుంది. గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగండి. భావోద్వేగంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఇది ఇబ్బందులను పెంచుతుంది. ఆర్థికపరమైన విషయాలు, లావాదేవీల విషయంలో ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు.

మిథున రాశి

శని రివర్స్ కదలిక మిథున రాశి వారికి ఇబ్బందులు అధికమవుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ధన సంబంధ సమస్యలు కలుగుతాయి. పనుల్లో సవాళ్లు అధికమవుతాయి. ప్రత్యర్ధులు ఈ సమయంలో ఇబ్బంది పెడతారు. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించకుండా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవద్దు.

కన్యా రాశి

శని తిరోగమన కదలిక కన్యా రాశి వారికి జీవితంలో అలజడి కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సంబంధాల్లో విభేదాలు పెరుగుతాయి. ఆఫీసు రాజకీయాలు పనులపై ప్రభావం పడుతుంది. ఖర్చులను నియంత్రించడం కష్టమవుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఓపిక పట్టాలి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. సహోద్యోగుల మధ్య స్నేహపూర్వకమైన సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి.

ధనుస్సు రాశి

శని తిరోగమనం ధనుస్సు రాశి వారికి కష్టాలపై ఎంత కష్టపడినా నిరాశాజనక ఫలితాలు పొందుతారు. పనులు చేయాలని అనిపించదు. మనసు అశాంతితో నిండిపోతుంది. ఈ కాలంలో ఆర్థిక విషయాలలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు డబ్బులు తెలివిగా ఖర్చు పెట్టాలి. లావాదేవీలు తెలివిగా చేయాలి. కార్యాలయంలో సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండండి. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఏ పని చేసిన ప్రతి పనిలోనూ మంచి చెడులు తెలిసిన తర్వాతే చేయండి.

కుంభ రాశి

శని కుంభ రాశిలోనే తిరోగమన దశలోకి వెళ్తాడు. ఫలితంగా ఈ రాశి వారి జీవితంలో శని అనేక ప్రధాన మార్పులను తీసుకొస్తాడు. వృత్తిలో పురోభివృద్ధికి అవకాశాలు ఉంటాయి కానీ ఆటంకాలు కూడా ఎదురవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. బడ్జెట్ పై శ్రద్ద వహించాలి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలు జాగ్రత్తగా తీసుకోవాలి పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు ప్రయత్నించండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది.

Whats_app_banner