Kendra trikona raja yogam: కేంద్ర త్రికోణ రాజయోగం ఇవ్వనున్న శని.. వీరికి ఊహించని విజయాలు, ఆర్థిక లాభాలు
Kendra trikona raja yogam: శని త్వరలో తిరోగమన దశలో సంచరించబోతున్నాడు. ఫలితంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని విజయాలు, ఆర్థిక లాభాలు కలగబోతున్నాయి.
Kendra trikona raja yogam: నవగ్రహాలలో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శని. జ్యోతిషశాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. పాప గ్రహంగా పరిగణిస్తారు. కర్మల అనుసారం ఫలితాలను ఇస్తాడు.
శని దేవుడు అశుభ ప్రభావాలు ఇస్తారని అందరూ అనుకుంటారు. కానీ శుభ ఫలితాలను కూడా ఇస్తాడు. ఈ ఏడాది మొత్తం శని కుంభ రాశిలో తన ప్రయాణం సాగిస్తాడు. అయితే ఇప్పుడు శని తన కదలిక మారబోతుంది. జూన్ 30 నుంచి శని తిరోగమన దశలో సంచరిస్తాడు. ఈ కదలిక కొందరి జీవితాల్లో మార్పులను తీసుకొస్తుంది. శని తిరోగమన దశ వల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది జీవితంలోని వివిధ కోణాల్లో మార్పులు కలిగిస్తుంది.
కేంద్ర త్రికోణ రాజయోగం అంటే ఏంటి?
జాతకంలో ఒకటి, నాలుగు, ఏడు, పదో గృహాలను కేంద్రంగా పిలుస్తారు. ఐదు తొమ్మిది గృహాలను త్రికోణమంటారు. కేంద్ర గృహాలు విష్ణు స్థలంగా పరిగణిస్తారు. త్రికోణ గృహాల్లో లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటాయి. కేంద్ర త్రికోణ గృహాల మధ్య సంబంధం ఉన్నప్పుడు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. జూన్ నెలలో శని సృష్టించిన ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకొస్తుంది. కేంద్ర త్రికోణ రాజయోగం నుండి అదృష్టం పొందే రాశులు ఏవో చూద్దాం.
కుంభ రాశి
కేంద్ర త్రికోణ రాజయోగం కుంభ రాశిలో ఏర్పడుతుంది. ఫలితంగా దీని నుండి ఈ రాశి జాతకులు భారీగా ప్రయోజనం పొందుతారు. వీరికి మంచి రోజులు మొదలవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో పురోగతి విజయాన్ని సాధిస్తారు. ఈ రాజయోగం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయ వనరులు కొత్తవి ఏర్పడతాయి. కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. లక్ష్యాలను పూర్తి చేయడంలో అదృష్టం మద్దతుగా ఉంటుంది. ఈ రాజాయోగం వల్ల విజయావకాశాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడటం చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. శని తిరోగమనం వీరికి చాలా శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు రాణిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు ఈ కాలంలో పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరగటం వల్ల జీవితం సంతోషంగా ఉంటుంది.
వృషభ రాశి
కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల వృషభ రాశి వాళ్ళు వృత్తిలో విజయం సాధిస్తారు. ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు చాలా లాభాలను పొందుతారు. మీరు వేసుకున్న ప్రణాళికలు, వ్యూహాలు ఈ కాలంలో విజయవంతం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఈ కాలంలో తమకు వచ్చిన ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు నచ్చిన ప్రాంతానికి బదిలీ అవుతారు. వ్యాపారవేత్తలకు ఆర్థిక లాభాలు కలుగుతాయి.
సింహ రాశి
సింహ రాశి ఆరు, ఏడో ఇంటికి అధిపతిగా శని వ్యవహరిస్తాడు. ఏడో ఇంట్లో శని తిరోగమనం చెందుతాడు. వ్యాపారం ఈ సమయంలో ఊపందుకుని మంచి లాభాలను ఇస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల మీరు ఆశ్చర్యకరమైన శుభవార్తలు వింటారు. మీరు ఉద్యోగపరంగా మారాలని చూస్తున్నట్లయితే కొత్త అవకాశాలు తారసపడతాయి. ఆర్థికపరంగా లాభపడతారు.