Kendra trikona rajayogam: కేంద్ర త్రికోణ రాజయోగం.. ఈ రాశుల వాళ్ళు జాక్ పాట్ కొట్టినట్టే-kendra trikona raja yogam in mesha rashi these zodiac signs get profit and wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kendra Trikona Rajayogam: కేంద్ర త్రికోణ రాజయోగం.. ఈ రాశుల వాళ్ళు జాక్ పాట్ కొట్టినట్టే

Kendra trikona rajayogam: కేంద్ర త్రికోణ రాజయోగం.. ఈ రాశుల వాళ్ళు జాక్ పాట్ కొట్టినట్టే

Gunti Soundarya HT Telugu
Apr 04, 2024 04:30 PM IST

Kendra trikona rajayogam: బుధుడి సంచారం వల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి సంపద పెరుగుతుంది. ఈ యోగం ప్రభావంతో ఆదాయం రెట్టింపు అవుతుంది.

కేంద్ర త్రికోణ రాజయోగం
కేంద్ర త్రికోణ రాజయోగం (pixabay)

Kendra trikona rajayogam: గ్రహాల యువరాజు బుడుధు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రయాణించడానికి 23 నుంచి 30 రోజులు పడుతుంది. ఈ క్రమంలో బుధుడు మార్చి 26న దేవ గురువు బృహస్పతికి చెందిన మీన రాశిని విడిచిపెట్టి అంగారకుడి సొంత రాశి అయిన మేష రాశిలోకి ప్రవేశించాడు. ఏప్రిల్ 9 వరకు ఈ రాశిలో తిరోగమన స్థితిలో ఉండి అదే రోజు సాయంత్రం మీన రాశిలో వెళతాడు. తర్వాత మే 10 మళ్లీ మేష రాశిలోకి ప్రవేశిస్తాడు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు మేష రాశిలో ఉండటంతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏప్రిల్ 9 వరకు ఉంటుంది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కెరీర్ లో అపారమైన విజయాన్ని సాధిస్తారు. వ్యాపారవేత్తలు భారీ లాభాలను పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాలు పెరుగుతాయి. ఏయే రాశుల వారికి కేంద్ర త్రికోణ రాజయోగం ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

వృషభ రాశి

వృషభ రాశికి శుక్రుడు అధిపతి. బుధుడు, శుక్రుడు స్నేహపూర్వక గ్రహాలు. ఫలితంగా ఈ రాశి వారి మీద బుధుడి అనుగ్రహం ఉంటుంది. పనిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుంచి మంచి గౌరవాన్ని పొందుతారు. ఫలితంగా ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లేందుకు ఇది చక్కని అవకాశం. విద్యార్థులు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఈ సమయంలో సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సరైన రీతిలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.

కన్యా రాశి

కేంద్ర త్రికోణ రాజయోగం కన్యా రాశి వారికి శుభఫలితాలు ఇస్తుంది. ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. సుదూర ప్రయాణాలు విజయవంతం అవుతాయి. జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తులు స్నేహితులు అవుతారు. ఈ రాజయోగం ప్రభావంతో మీ పనులన్నీ విజయవంతం అవుతాయి. వృత్తిలో స్థిరత్వం ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబం లేదా జీవిత భాగస్వామితో కలిసి అందమైన ప్రదేశాలను సందర్శిస్తారు. పెట్టుబడులు పెడితే మంచి లాభాలు అందుతాయి. తోబుట్టులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది.

తులా రాశి

తుల రాశి వారికి ఈ రాజయోగం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి. భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విదేశీ వ్యక్తులతో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. ఈ సమయంలో కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తే అందులో విజయం సాధిస్తారు. కేంద్ర త్రికోణ రాజయోగం 2024 కారణంగా ఆర్థిక లాభాలకు భారీ అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమికులు పెళ్లి పీటలు ఎక్కుతారు. భార్యాభర్తల మధ్య సంబంధం మరింత బలపడుతుంది. తెలివితేటలతో తీసుకునే నిర్ణయాలు లాభాలను ఇస్తాయి. మీ మాటలు ప్రేమ పూర్వక ప్రవర్తనతో ఇతరుల హృదయాలను గెలుచుకుంటారు.

మకర రాశి

కేంద్ర త్రికోణ రాజయోగం మకర రాశి వారికి ఒక వరం లాంటిది. అదృష్టం పూర్తి మద్దతు పొందుతారు. వాహనం ఆస్తి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు కొలిక్కివస్తాయి. అధిక ఆదాయ స్థాయిలతో మకర రాశి వారికి సంతోషంగా ఉంటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. బంధువులతో ఉన్న వివాదాలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. కార్యాలయంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి సహకారంతో ప్రమోషన్ లభిస్తుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు.