Mercury combust: బుధుడి అస్తంగత్వం.. నేటి నుంచి రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి-mercury combust in aries these zodiac signs cause tension in their life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Combust: బుధుడి అస్తంగత్వం.. నేటి నుంచి రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి

Mercury combust: బుధుడి అస్తంగత్వం.. నేటి నుంచి రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి

Gunti Soundarya HT Telugu
Apr 04, 2024 03:13 PM IST

Mercury combust: గ్రహాల రాకుమారుడు బుధుడు ఏప్రిల్ 4వ తేదీన అస్తంగత్వ దశలోకి వెళతాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వాళ్ళు నేటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టాలు ఇబ్బంది పెట్టనున్నాయి.

బుధుడి అస్తంగత్వం
బుధుడి అస్తంగత్వం

Mercury combust: జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో ఒక్కొక్క దానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాలు తమ రాశి చక్రాన్ని మార్చుకుంటాయి. అలాగే వాటిని స్థితిని కూడా మార్చుకుంటాయి. ఒక్కోసారి తిరోగమన దశలో సంచరిస్తే మరొకసారి ప్రత్యక్ష మార్గంలో పయనిస్తాయి. అలాగే నిర్దిష్ట సమయంలో తర్వాత అవి అస్తంగత్వ దశకు వెళతాయి.

గ్రహాల రాకుమారుడు బుధుడు నేటి(ఏప్రిల్ 4వ తేదీ) నుంచి మేష రాశిలో అస్తంగత్వ దశలోకి వెళతాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంది. ఏదైనా ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు దాని ప్రభావం కోల్పోతుంది. ఆ సమయంలో ఆ గ్రహం అస్తంగత్వ దశలోకి వెళుతుంది. అటువంటి సమయంలో కొన్ని రాశుల వాళ్ళు అనుకూలమైన ఫలితాలు పొందలేకపోవచ్చు.

బుధుడి అస్తంగత్వ ప్రభావం 

జ్ఞానం, తెలివితేటలు, మేధస్సు వంటి వాటికి బుధుడు కారకుడుగా భావిస్తారు. బుధుడి స్థానం బలంగా ఉంటే అన్ని రకాల సౌఖ్యాలు పొందుతారు. మేష రాశి మూడు, ఆరు గృహాలను పాలిస్తాడు. ఈ రాశిలో బుధ గ్రహం అస్తమించడం వల్ల అనేక రకాల ఆర్థిక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. తోబుట్టువులతో సమస్యలు ఎదురవుతాయి. ఉన్నతాధికారులు, సహొద్యోగులతో వాగ్వాదాలు జరుగుతాయి.

ఈ సమయంలో అదృష్టం మీకు మద్దతుగా ఉండదు. ఈ కాలంలో మీరు చేపట్టే ప్రయత్నాలలో కొన్ని లోపాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కోసం ఇంకొంత కాలం వేచి చూడాల్సి వస్తుంది. వృత్తిపరంగా ఈ సమయంలో మీరు పనిపై అదనపు శ్రద్ధ వహించాలి. లేదంటే తప్పులు జరిగే అవకాశం ఉంది. దాని ప్రభావం మీ ప్రమోషన్ మీద పడుతుంది. ఈ సమయంలో మీకు సంతృప్తికరమైన ఫలితాలు ఉండకపోవచ్చు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే అందుకు ఇది మంచి సమయం కాదు.

మెడ, భుజం ఇతర నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. బుధుడి అస్తంగత్వ దశ వల్ల ఏయే రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఎదురువుతాయో చూద్దాం.

తులా రాశి

తులా రాశి వారికి బుధుడి అస్తంగత్వం ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మనసు నెగిటివ్ ఫీలింగ్ తో నిండిపోతుంది. భాగస్వామితో విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది.

వృశ్చిక రాశి

బుధుడి కదలిక వృశ్చిక రాశి వారికి కలిసి రాకపోవచ్చు. వృత్తిలో సహోద్యోగులతో గొడవలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మితిమీరిన ఖర్చులు మనసుని కలిచి వేస్తాయి. అనవసరమైన వారికి దూరంగా ఉండాలి.

కుంభ రాశి

బుధుడి అస్తంగత్వం మీకు శుభప్రదంగా ఉండదు. ఆర్థిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవితంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాల్సిన అవసరం ఉంది.

బుధ గ్రహం పరిహారాలు

బుధ గ్రహం అశుభ ప్రభావాలను తగ్గించడం కోసం బుధవారం ఆవుకు పచ్చిమేత తినిపించండి. బుధ గ్రహాన్ని బలోపేతం చేసేందుకు ఓం బుధాయ నమః అని బుధుడికి సంబంధించిన మంత్రాలు జపించాలి. అలాగే బుధవారం ఆకుపచ్చ కూరగాయలు, ఆహార ధాన్యాలు దానం చేయడం వల్ల బుధుడి అనుగ్రహం లభిస్తుంది.

 

 

Whats_app_banner