Shani jayanti 2024: వీళ్ళు శని అనుగ్రహం పొందేందుకు జూన్ నెల చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే..
Shani jayanti 2024: శని సడే సతీ, దయ్యా ప్రభావం నుంచి బయట పడేందుకు కొన్ని రాశుల వారికి జూన్ నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే జూన్ నెలలో శని జయంతి వచ్చింది. శని అనుగ్రహం పొందేందుకు ఈ సమయం చాలా ఉత్తమమైనది.
Shani jayanti 2024: ఈ సంవత్సరంలోని జూన్ నెల శని దేవుని ప్రత్యేక అనుగ్రహం పొందేందుకు కొన్ని రాశుల వారికి అద్భుతమైన సమయం. శని దేవుడు కర్మలకు అనుగుణంగా లెక్కలు చెబుతాడని అంటారు. అందుకే శని దేవుడిని చూస్తే అందరూ భయపడతారు.
జూన్ నెలలో శని జయంతి వచ్చింది. ఈరోజు శని దేవుడిని పూజించడం ద్వారా ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఏలినాటి శని, అర్థాష్టమ శని సమస్యల నుంచి బయటపడేందుకు శని ఆరాధన చాలా ముఖ్యం. ఈ సమయంలో మకరం, కుంభం, మీన రాశి వారికి ఏలినాటి శని కాలం నడుస్తుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారి జాతకంలో శని అశుభ స్థితిలో ఉన్నవారికి శని జయంతి అద్భుతమైన రోజుగా మారబోతుంది. ఈ రోజున రావి చెట్టును పూజించాలి. అలాగే రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. వీటితో పాటు శనికి సంబంధించిన వస్తువులు దానం చేయడం మంచిది.
జ్యేష్ట మాసంలో వచ్చే అమావాస్య రోజున శని జయంతి జరుపుకుంటారు. ఈ ఏడాది శని జయంతి జూన్ 6వ తేదీన వచ్చింది. ఈరోజు వట్ సావిత్రి వ్రతం కూడా ఉంది. ఈరోజు వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు, సంతోషం కోసం ఉపవాసం పాటిస్తారు. వట్ సావిత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా కుటుంబ సభ్యులకు శుభం కలగడంతో పాటు వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది.
శని అనుగ్రహం కోసం ఏం దానం చేయాలి?
శని జయంతి రోజు చేసే దానం, దక్షిణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ధార్మిక గ్రంథాల ప్రకారం సూర్య భగవానుడు, ఛాయాదేవి దంపతుల కుమారుడు శని దేవుడు. శివుడు, హనుమంతుని ఆరాధనతో శని కూడా సంతోషిస్తాడు. శివుడికి పరమభక్తుడు శనీశ్వరుడు. అందుకే వీరిని ఆరాధించడం వల్ల ఎల్లప్పుడూ శని ఆశీస్సులు మీకు లభిస్తాయి.
శని జయంతి రోజు ఏడు ముఖి రుద్రాక్షలు ధరించి రావి, శమీ వృక్షాలను పూజించాలి. ఇలా చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది. నిస్సహాయులకు సేవ చేయడం, సహాయం చేయడం వంటి మంచి కార్యక్రమాలు, దాతృత్వ కార్యక్రమాలు చేపడితే శని దేవుడు సంతోషిస్తాడు. శని చల్లని చూపు మీకు లభిస్తుంది. అలాగే నలుపు రంగు శని ప్రతీకగా భావిస్తారు. అందుకే శని జయంతి రోజు నల్ల ఆవు, నల్ల కుక్క, కాకికి ఆహారం పెట్టడం వంటివి చేయాలి.
అలాగే శనికి సంబంధించిన ఆవ నూనె, బొగ్గు, ఇనుమ పాత్రలు, నల్ల బట్టలు, నల్ల గొడుగు, నల్ల నువ్వులు, నల్ల మినపప్పు మొదలైన వాటిని దానం చేయడం వల్ల శని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇది ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావం నుంచి బయటపడేస్తుంది.
శనీశ్వరుడికి నూనె, పువ్వులు సమర్పించాలి. శని దేవుడి ఆలయానికి వెళ్లి పూజలు చేయాలి. శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు శనికి సంబంధించిన మంత్రాలు జపించాలి.
శని మంత్రాలు
ఓం శని అభయ హస్తాయ నమః
ఓం శనీశ్వరాయ నమః
ఓం నీలాంజనసమాభం రవి పుత్రం యమగ్రహం ఛాయామార్తాండ సంభం తథానామి శనైశ్చరం
ఈ మంత్రాలు పఠిస్తే శనీశ్వరుడు ప్రసన్నుడు అవుతాడు.