హిందూమతంలో శని జయంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీన్నే 'శని అమావాస్య' అని కూడా అంటారు. శని దేవుడు సూర్యభగవానుడు, ఛాయా దేవిల కుమారుడు. శనిదేవుడిని కర్మఫలాదత అని కూడా అంటారు.
ఈ ఏడాది శని జయంతిని రేపు అంటే మే 19న జరుపుకుంటున్నారు. ఈ రోజున పూజలు, వ్రతాలు, ఉపవాసాల ద్వారా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శనీశ్వరుని జన్మదినాన్ని గంగానదిలో స్నానం చేసి జరుపుకోవడం ఆనవాయితీ. దీనితో పాటు ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా చదవడం ద్వారా కూడా శనిదేవుని అనుగ్రహం పొందవచ్చు. శనిగ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి భక్తులు శని శాంతి, శని జపం వంటి పూజలు చేయడం ద్వారా ఆయన ఆశీర్వాదం పొందుతారు. శనివారం రోజున ఉపవాసం ఉండి శని దేవుడిని పూజించాలి.
ఓం నీలాంజన సమాభాసం..
రవిపుత్రం యమాగ్రజం..
ఛాయామార్తాండ సంభూతం..
తం నమామి శనైశ్చరం..
ఓం శం శనైశ్చరాయ నమః
అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు.