Elinati shani effect: అప్పటి వరకు మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం.. విముక్తి పొందేందుకు ఇలా చేయండి
Elinati shani effect: ప్రస్తుతం ఏలినాటి శని మొదటి దశ ప్రభావం మీన రాశి వారి మీద ఉంది. 2025 మార్చిలో ఈ ప్రభావం నుంచి విముక్తి కలుగుతుంది. శని దేవుడి ఆశీస్సులు పొందటం కోసం ఈ పరిహారాలు పాటిస్తే మంచిది.
Elinati shani effect: ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో శని దేవుడి చెడు ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావంతో జీవితంలో అనేక కష్టాలు ఎదురవుతాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడి అనుగ్రహం ఉంటే పేదవాడు రాజు కాగలడు. జీవితంలో అన్ని రకాల సుఖాలు, సౌకర్యాలు పొందుతారు. అదే శని దేవుడి చెడు చూపు పడితే వివిధ సమస్యలు, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం కుంభం, మకరం, మీన రాశికి చెందిన జాతకులు సడే సతి ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. సడే సతి మొదటి దశ మీన రాశిపై ఉండబోతుంది. దీనివల్ల అనేక అవస్థలు పడాల్సి వస్తుంది.
ఏప్రిల్ 29, 2022 నుండి మీన రాశిలో సడే సతి కాలం ప్రారంభమైంది. 22 సంవత్సరాల తర్వాత మీన రాశికి చెందిన వాళ్ళు ఏలినాటి శని ప్రభావం ఎదుర్కొంటున్నారు.
సడే సతి ప్రభావం నుంచి ఎప్పుడు విముక్తి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన స్థానాన్ని మార్చుకుంటాడు. ఏలినాటి శని ఒక దశ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం మీన రాశిలో ఈ దశ కొనసాగుతుంది. 29 మార్చి 2025 వరకు ఏలినాటి శని ప్రభావం మీన రాశి మీద ఉంటుంది. తర్వాత రెండవ దశ ప్రారంభం అవుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 7, 2030 నుంచి మీన రాశి వారికి శని సడే సతి నుంచి ఉపశమనం లభిస్తుంది.
శని సడే సతి ప్రభావంతో మానసిక ఒత్తిడి, తెలియని వ్యాధులు, భయాలు, జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కష్టాలన్నింటిని నివారించడం కోసం శని దేవుడిని ఆరాధించాలి. శనీశ్వరుడి కోపాన్ని తగ్గించడం కోసం కొన్ని పరిహారాలు పాటించడం మంచిది.
దానాలు చేయాలి
ప్రజలకు సహాయం చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహాన్ని పొందుతారు. వారికి అవసరమైన వస్తువులు దానం చేయాలి. అలాగే ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవడం కోసం శివుడికి జలాభిషేకం చేయాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపించాలి.
శనిదేవుడికి పూజ
శని శుభ ఫలితాల కోసం శనివారం నాడు శనిదేవుడిని పూజించాలి. స్నానం చేసి ధ్యానం చేయాలి. శని దేవుడిని అన్నీ ఆచారాలతో పూజించాలి. శని యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఈ యంత్రాన్ని క్రమం తప్పకుండా పూజించడం వల్ల శని చెడు ప్రభావం నుంచి ఉపశమనం కలుగుతుంది.
రావి, శమీ చెట్లకు పూజలు
మీన రాశి జాతకులు గురు, శనివారాల్లో రావి చెట్టుకు నీరు సమర్పించాలి. మూడుసార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు. పనుల్లో విజయాలు లభిస్తాయి. అలాగే శని దేవుడి అనుగ్రహం పొందడం కోసం శమీ చెట్టు మూలాన్ని కొద్దిగా తీసుకొని ఒక నల్లటి వస్త్రంలో దాన్ని కట్టాలి. ఆ వస్త్రాన్ని మీ కుడి చేతికి కట్టుకోవాలి. ఈ పరిహారం పాటించడం వల్ల ఏలినాటి శని నుంచి ఉపశమనం లభిస్తుంది. శనివారం మాత్రమే ఈ పరిహారం చేయాలి.
హనుమాన్ చాలీసా
శని దేవుడి అనుగ్రహం పొందడం కోసం శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠిస్తే శనీశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి. ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని రకాల అశుభాలు తొలగిపోతాయి. శని దుష్ప్రభావాల నుంచి విముక్తి కలుగుతుంది.
ఏలినాటి శని నుంచి ఉపశమనం పొందడం కోసం శనివారం నాడు ధార్మిక వస్తువులు దానం చేయాలి. క్లిష్ట పరిస్థితుల నుంచి త్వరగా బయటపడేందుకు మీరు ఇనుము, ఆవనూనె, నల్లని వస్త్రాలు వంటి వస్తువులు శనివారం నాడు దానం చేయాలి. ఇవే శని దేవుడికి ఇష్టమైనవి. వీటిని దానం చేయడంవల్ల ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి.