Vastu tips for success: విజయాన్ని అందించే సింపుల్ వాస్తు చిట్కాలు- ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇక మీ ఇంట్లోనే
21 September 2024, 16:00 IST
- Vastu tips for success: ప్రతికూల శక్తిని తొలగించడానికి సానుకూల శక్తిని కలిగి ఉండటం అవసరం. వాస్తు ప్రకారం ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ పెంచుకునేందుకు ఏయే చర్యలు తీసుకోవాలో తెలుసుకోండి. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో లక్ష్మి దేవి నివసిస్తుందని నమ్ముతారు.
విజయాన్ని అందించే వాస్తు నియమాలు
Vastu tips for success: శక్తి లేదా పర్యావరణం ఒక వ్యక్తి పురోగతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి పని చేసే వాతావరణం కూడా అతని పనిని ప్రభావితం చేస్తుందని అంటారు. కొన్ని సార్లు చాలా కష్టపడి పని చేసినప్పటికీ అతను విజయం సాధించలేడు. వాస్తు ప్రకారం దీనికి ఒక కారణం ఉంది. అదే మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి.
లేటెస్ట్ ఫోటోలు
వాస్తులో ప్రకారం మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని పోగొట్టేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా మీరు మీ జీవితం నుండి ప్రతికూలతను తొలగించవచ్చు. జీవితంలో సానుకూల శక్తిని నింపవచ్చు. అలాగే పురోగతికి మార్గం తెరవవచ్చు. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. ఎటువంటి పనులు చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టవచ్చో తెలుసుకుందాం.
సానుకూల శక్తిని ఇచ్చే చిట్కాలు
వాస్తు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పే దాని ప్రకారం చాలా మంది ఇంట్లో శివలింగం, శాలిగ్రామం పెట్టుకుని పూజలు చేస్తారు. అయితే ఇంట్లో రెండు శివలింగాలు, మూడు వినాయకుడి విగ్రహాలు, రెండు శాలిగ్రామాలు ఉంచకూడదు. ఇవి ఒక్కటి మాత్రమే ఉండాలి.
సాధారణంగా శివలింగాన్ని గుడిలో పూజిస్తారు. కొంతమంది ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటారు. వాస్తవానికి శివలింగాన్ని ఇంట్లో ఉంచకూడదు. కానీ మీరు దానిని ఉంచవలసి వస్తే మీరు దానిని చాలా చిన్న పాదరసం లేదా క్రిస్టల్‌తో తయారు చేయవచ్చు. విష్ణుమూర్తి స్వరూపంగా భావించే శాలిగ్రామం ఇంట్లో ఉంటే చాలా మంచిది. అయితే వీటిని పెద్దవిగా కాకుండా ఎంత చిన్నదైతే అంత మంచిది.
ఒక దీపం నుండి మరొక దీపం వెలిగించకూడదు. దీపం కింద బియ్యం ఉంచండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం గుమ్మం దగ్గర దీపం వెలిగించడం మంచిది. మీరు పూజలో చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నీటి పాత్రను ఉంచండి. ఎల్లప్పుడూ భగవంతునికి సంపూర్ణ ఫలాలను సమర్పించండి. కోసిన పండ్లను అందించవద్దు. మీరు పూజ చేసినా చేయకపోయినా ఇంట్లో కొంత సమయం పాటు ధ్యానంలో కూర్చోవడానికి అనుకూలమైన దిశలో ఒక స్థలాన్ని ఎంచుకోండి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఇవి ఉంచండి
ఇంటి ప్రధాన ద్వారం వద్ద కుంకుమ, పసుపు కలిపి స్వస్తిక్ గుర్తును వేసుకుంటే మంచిది. ప్రధాన ద్వారం వద్ద అశోక, మామిడి ఆకులతో తయారు చేసిన తోరణాన్ని ఉంచండి. అవి ఎండిపోయినప్పుడు లేదా మూడు-నాలుగు రోజుల తర్వాత మార్చాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూలత వస్తుందని నమ్ముతారు.
ఉదయం నిద్ర లేవగానే ప్రధాన ద్వారం శుభ్రం చేసి దానిపై గంగా జలం, గోమూత్రం చల్లాలి. ప్రధాన ద్వారం ముందు స్తంభం లేదా చెట్టు ఉంటే దానిని తొలగించండి. ఇంటి గుమ్మం ఎదురుగా ఏదీ ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నమ్ముతారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్