Swastik symbol vastu tips: ఇంటి ముందు ఈ దిశలో స్వస్తిక్ చిహ్నం పెట్టారంటే సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి
Swastik symbol vastu tips: ఇంటి ముందు రాగితో చేసిన చిహ్నం పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశలో స్వస్తిక్ గుర్తు పెడితే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
Swastik symbol vastu tips: హిందూ మతంలో పూజ లేదా ఏదైనా శుభకార్యం ప్రారంభించే సమయంలో స్వస్తిక్ గుర్తు వేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. స్వస్తిక్ అంటే శుభం జరగటం అని అర్థం. ఈ గుర్తు వేయడం వల్ల ఇంటికి సంతోషం, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు. స్వస్తిక్ గుర్తును మొదట పూజ అందుకునే విఘ్నేశ్వరుడుగా భావిస్తారు. అందుకే అన్ని శుభకార్యాల ప్రారంభోత్సవంలో స్వస్తిక్ గా తప్పకుండా గీస్తారు.
భూమి, అగ్ని, నీరు, గాలి, ఆకాశానికి చిహ్నంగా దీని పరిగణిస్తారు. ఓం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిహ్నం స్వస్తిక్. ఇది జీవన చక్రాన్ని సూచిస్తుంది. ఇందులోని నాలుగు గదులు స్వర్గం, నరకం, మానవుడు, జంతుజాలాలను సూచిస్తాయని విశ్వసిస్తారు. స్వస్తిక్ లోనే నాలుగు దిక్కులు ధర్మం, అర్థం, కామం, మోక్షానికి చిహ్నంగా భావిస్తారు. ఈ గుర్తును విష్ణువు, లక్ష్మీ స్వరూపంగా చెప్తారు ఇంట్లో ఉంటే సుఖసంతోషాలు పెరుగుతాయి.
వాస్తు ప్రకారం ఇంట్లో సానుకూల శక్తిని ఆహ్వానించేందుకు స్వస్తిక్ గీస్తారు. వయసు ప్రకారం స్వస్తిక్ గీసేటప్పుడు కొన్ని విషయాలు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. స్వస్తిక్ గీయడం వల్ల చేపట్టిన పనులు శుభప్రదంగా విజయవంతం అవుతాయని విశ్వసిస్తారు. ఈ చిహ్నానికి 12వేల సంవత్సరాల కిందటి చరిత్ర ఉందని చెప్తారు. హిందూమతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ గుర్తును బౌద్ధ, జైన మతాలలో కూడా ఉపయోగిస్తారు . అనేక దేశాలలోనూ ఈ గుర్తుని పవిత్రంగా భావిస్తారు. ప్రపంచం మొత్తం స్వస్తిక్ గుర్తుని శుభానికి, అదృష్టానికి సంకేతంగా భావిస్తారు.
పాశ్చాత్య దేశాల్లోని ప్రార్థన మందిరాలలో, దేవాలయాలలో కూడా స్వస్తిక్ గుర్తు కనిపిస్తుంది. హిందూ మతం నుంచి ఈ గుర్తు ప్రపంచ దేశాలకు వ్యాపించింది అని పరిశోధకులు వెల్లడించారు.
స్వస్తిక్ చిహ్నం పెట్టేందుకు వాస్తు నియమాలు
స్వస్తిక్ చిహ్నం ఉన్న ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు. దృష్టి దోషాల నుంచి కూడా ఇంటిని కాపాడుతుందని నమ్ముతారు. వేద మంత్రోచ్చారణ సమయంలో ఓం శబ్దం తర్వాత స్వస్తి అనే పదాన్ని ఎక్కువగా వాడటం గమనిస్తాం. ఏ పని చేపట్టిన అందులో ఆటంకాలు ఎదురుకాకూడదని భావంతో ఈ పదం ఉచ్చరిస్తారు.
వాస్తు ప్రకారం స్వస్తిక్ చిహ్నం ఇల్లు లేదా కార్యాలయంలో తూర్పు, ఈశాన్య, ఉత్తర దిశలో మాత్రమే గీయాలి. అష్టాదశ లేదా రాగి స్వస్తిక్ గుర్తు ఇంట్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. పిల్లల స్టడీ రూమ్ లో నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు చదువులో ఉన్నతంగా రాణిస్తారు. చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది.
ఇంట్లో స్వస్తిక్ గుర్తును ఎప్పుడూ కుంకుమతోనే వేయాలి. వాస్తు ప్రకారం స్వస్తిక్ గుర్తు ఉన్న దగ్గర చెప్పులు, బూట్లు వంటివి ఉండకూడదు. వాస్తు దోషాలను తొలగించడం కోసం స్వస్తిక్ గుర్తు ఇంట్లో వేసుకుంటారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరించేలా చేసేందుకు ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గీయవచ్చు. లేదంటే రాగి స్వస్తిక్ ప్రతిమ మనం ఇంటికి వేలాడదీయవచ్చు.
సంపదని పెంచేందుకు
ఇంటి గుమ్మం మీద స్వస్తిక్ చిహ్నం వేయడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. నెగిటివిటీ తొలగిపోతుందని చెప్తారు. ఇంటి ముందు చెట్టు లేదా స్తంభం ఉంటే ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గీయడం శుభప్రదం.
ఇంటి ప్రధాన ద్వారం మీద రాగి స్వస్తిక్ గుర్తును ఉంచడం వల్ల అదృష్టం వరిస్తుంది. ఇది శ్రేయస్సు, పురోగతిని తీసుకొస్తుంది. ఇంటి బయట ఈ గుర్తు ఉంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా పట్టిపీడిస్తున్న వ్యాధులు నయమవుతాయి.
ఇంటి ముఖ దారం దగ్గర ఓం, స్వస్తిక్ లాంటి ఆధ్యాత్మిక చిహ్నాలు ఉండటం వల్ల అంతా మంచే జరుగుతుంది. సానుకూల శక్తులు ఆకర్షిస్తుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు శాంతి పెరుగుతాయి.
టాపిక్