Swastik symbol: హిందూమతంలో స్వస్తిక్ గుర్తుకు ఎందుకంత ప్రాముఖ్యత?
Swastik: కొత్త వాహనం కొనుగోలు చేసినా, పెళ్లి పత్రికలపై, ఇంటి గృహప్రవేశం సమయంలో స్వస్తిక్ గుర్తు వేస్తారు. అసలు స్వస్తిక్ గుర్తు ఎందుకు వేస్తారో తెలుసా?
Swastik: ఓంకారం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన చిహ్నం స్వస్తిక్. హిందూమతంలో ఎంతో శక్తివంతమైన చిహ్నాలలో ఇదీ ఒకటి. సంస్కృత పద్యం స్వస్తిక నుంచి ఉద్భవించింది. శ్రేయస్సు అని దీని అర్థం. ఈ పురాతన చిహ్నం అనే సంస్కృతులలో విభిన్న అర్థాలని కలిగి ఉంటుంది. జీవన చక్రాన్ని స్వస్తిక్ సూచిస్తుంది.
భారతదేశంలో మాత్రమే కాకుండా అనేక దేశాల్లోనూ స్వస్తిక్ చిహ్నానికి ప్రాముఖ్యత ఇస్తారు. శ్రేయస్సు, అదృష్టానికి స్వరూపంగా స్వస్తిక్ గుర్తు పరిగణించబడుతుంది. ఇందులో ఉండే నాలుగు గదులు స్వర్గం, నరకం, మానవుడు, జంతుజాలాన్ని సూచిస్తుంది. ప్రపంచం మొత్తం స్వస్తిక్ గుర్తుని శుభానికి అదృష్టంగా చిహ్నంగా భావిస్తారు. స్వస్తిక్ అనేది సర్వోన్నత దేవుడైన నారాయణుని పాదాలపై ఒక ప్రత్యేక గుర్తు వంటిది.
పురాణాల ప్రకారం నారాయణుడి పాదాలపై 16 ప్రత్యేక గుర్తులు ఉన్నాయి. వాటిలో స్వస్తిక్ ఒకటి. పద్మ పురాణంలో బ్రహ్మ నారదుడికి ఈ సంకేతాల గురించి చెప్పాడు. వాటిలో స్వస్తిక్ కుడి పాదంలో ఎనిమిది ప్రత్యేక సంకేతాలలో భాగం. స్వస్తిక్ అనేది దైవిక ముద్రలాంటిది. భగవంతునితో అనుసంధానం చేస్తుంది. విష్ణువు చేస్తులో ఉండే సుదర్శన చక్రం చెడుని నివారించి శుభాలని కలిగిస్తుంది. అందుకే ఇంటికి, వ్యాపారాలు చేసే వాళ్ళు, కొత్త వాహనాల మీద స్వస్తిక్ గుర్తు వేస్తారు. ఇది నెగటివ్ ఎనర్జీని రాకుండా చేస్తుంది. ప్రతి శుభకార్యంలో స్వస్తిక్ గుర్తుని తప్పనిసరిగా వేస్తారు.
స్వస్తిక్ గుర్తు నాలుగు కాళ్ళ ప్రాముఖ్యత
స్వస్తిక్ చిహ్నం నాలుగు కాళ్ళు లేదా శాఖలకి అనేక వివరణలు ఉన్నాయి.
జ్ఞాన వ్యాప్తి: బ్రహ్మ దేవుడు నాలుగు ముఖాలతో అన్ని దిశలలో పవిత్రమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.
వేద జ్ఞానం: నాలుగు వేదాలైన రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదాలకి ప్రాతినిథ్యం వహిస్తాయి.
జీవిత సత్యాలు: ఇది పురుషార్థాలని కలిగి ఉంటుంది. ధర్మం, అర్థ(సంపద), కామ(కోరికలు), మోక్షం(విముక్తి)ని సూచిస్తుంది.
జీవిత దశలు: బ్రహ్మచర్యం, గ్రహస్థుడు, వానప్రస్థ(విశ్రాంత దశ), సన్యాసం( పరిత్యాగం)
సామాజిక క్రమం: వర్ణాలు-బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర
పూజా ఆచారాలలో స్వస్తిక్ చిహ్నం
ఇంటి గృహాప్రవేశాలు, పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు ముందుగా స్వస్తిక్ చిహ్నం వేస్తారు. ఇది ఇంటికి పాజిటివ్ శక్తిని తీసుకొస్తుందని నమ్ముతారు. ఇంటి గుమ్మానికి స్వస్తిక్ గుర్తు కట్టుకుంటే దృష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. కుడిచేతి ఉంగరం వేలితో పూజ స్థలంలో కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేస్తారు. పూజ ప్రారంభించే ముందు దైవిక ఆశీర్వాదాలు కోరుతూ దీన్ని వేస్తారు. కొన్ని సందర్భాలలో స్వస్తిక్ గుర్తు మధ్యలో చుక్కలు పెడతారు. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని నమ్ముతారు.
ఇతర సంస్కృతులలో స్వస్తిక్ ప్రాముఖ్యత
స్వస్తిక్ హిందూమతంలో విస్తృతంగా గుర్తిస్తారు. బౌద్ధమతంలో స్వస్తిక్ అనేది శుభానికి చిహ్నం. బుద్ధుని అడుగుజాడలు, అతని హృదయాన్ని సూచిస్తుంది. ధర్మానికి మార్గాన్ని సూచిస్తుంది. జైనమతంలో జైనులు స్వస్తిక్ ని ఏడవ తీర్థంకరుడైన సుపార్శ్వనాథుని చిహ్నంగా చూస్తారు. చైనా, జపాన్ వంటి వివిధ తూర్పు ఆసియా సంస్కృతులలో అదృష్టం, శ్రేయస్సు, దీర్ఘాయువుని సూచిస్తుంది.