Planet transit: ఒకే రోజు రాశులు మారనున్న రెండు గ్రహాలు.. ఈ రాశుల వారి అదృష్టానికి తిరుగు లేదు-on march 7th mercury and venus transit into meena rashi and kumbha rashi these zodiac signs get benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Planet Transit: ఒకే రోజు రాశులు మారనున్న రెండు గ్రహాలు.. ఈ రాశుల వారి అదృష్టానికి తిరుగు లేదు

Planet transit: ఒకే రోజు రాశులు మారనున్న రెండు గ్రహాలు.. ఈ రాశుల వారి అదృష్టానికి తిరుగు లేదు

Gunti Soundarya HT Telugu
Mar 05, 2024 11:02 AM IST

Planet transit: మార్చి 7న బుధుడు, శుక్రుడు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. ఫలితంగా నాలుగు రాశుల వారికి అదృష్టం రెట్టింపు ఉండబోతుంది.

రాశులు మారుతున్న బుధుడు, శుక్రుడు
రాశులు మారుతున్న బుధుడు, శుక్రుడు

Planet transit: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాలు తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. మార్చి నెలలో అనేక గ్రహాలు రాశులను మారుస్తూ ఇతర గ్రహాలతో కలయిక జరుగుతుంది. ఒకే రోజు రెండు పెద్ద గ్రహాలు రాశులని మార్చుకోవడం కీలకంగా మారింది. మార్చి 7న గ్రహాల రాకుమారుడు బుధుడు మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు. ఇక శుక్రుడు కూడ కుంభ రాశి ప్రవేశం చేస్తాడు. ఒకే రోజు బుధుడు, శుక్రుడు సంచారం నాలుగు రాశుల వారికి డబుల్ బెనిఫిట్స్ ఇవ్వబోతుంది.

జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడిని అదృష్ట గ్రహంగా పరిగణిస్తారు. బుధుడు జాతకంలో బలంగా ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు. మిథునం, కన్యా రాశికి బుధుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. బుధుడు బలంగా ఉండటం వల్ల ఆ వ్యక్తి కమ్యూనికేషన్ సామర్థ్యాలు అద్భుతంగా ఉంటాయి. తెలివిగా వ్యవహరిస్తారు. పనుల్లో చాలా చురుకుగా ఉంటారు. అలాంటి వ్యక్తులు వ్యాపారంలో విజయం సాధిస్తారు.

శుక్రుడు కూడా శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడు శుభంగా ఉంటే ఒక వ్యక్తి వైవాహిక జీవితం ఏ ఆటంకాలు లేకుండా సాగిపోతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెంచుతుంది. ప్రేమలో ఉన్న వారి జీవితాల్లో శృంగారం పెరుగుతుంది. అనేక భౌతిక ఆనందాలని పొందుతారు. సాహిత్యం, కళలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. వృషభం, తులారాశిని పాలిస్తాడు.

ఈ రెండు గ్రహాల సంచారం వల్ల ప్రత్యేకించి మీడియా, ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తుల కెరీర్ లో రాణిస్తారు. మీ పనిని గుర్తిస్తారు. ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది. వ్యాపారంలో ప్రయోజనాలు పొందుతారు. ఈ రెండు గ్రహాల సంచారం ఏ ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయో చూద్దాం.

కర్కాటకం

బుధుడు కర్కాటక రాశి తొమ్మిదో ఇంట్లో సంచరిస్తాడు. అలాగే శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ రెండు గ్రహాల ప్రభావం కారణంగా విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి అనుకూలమైన అవకాశం కలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి శుభవార్త అందుతుంది. ఉద్యోగంలో మీ ఆలోచనలకు ఉన్నతాధికారులు విలువ ఇస్తారు. ఆర్థిక పరంగా కర్కాటక రాశి వారికి ఊహించిన ప్రయోజనాలు అందుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీలో ఆధ్యాత్మిక భావం పెరుగుతుంది.

వృశ్చిక రాశి

బుధుడు సంచారం వృశ్చిక రాశి ఐదో ఇంట్లో జరగగా.. నాలుగో ఇంట్లో శుక్రుడు సంచారం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల సంచారం వల్ల వృత్తిపరంగా నిర్దిష్టమైన ప్రయోజనాలు పొందుతారు. అన్ని రంగాలలో పని చేసే వారికి కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సంతృప్తి చెందుతారు. భవిష్యత్తులో మీకు ప్రయోజనాలు చేకూరే సంపద లభిస్తుంది. ఊహించని ధన లాభాన్ని పొందుతారు. వ్యక్తిగతంగా కొన్ని విషయాలు ఇతరులతో పంచుకోకుండా ఉండటం మంచిది.

ధనుస్సు రాశి

ధనస్సు రాశి నాలుగో ఇంట్లో బుధుడు సంచారం జరగగా.. శుక్రుడు మూడో ఇంట్లో సంచరిస్తాడు. వీటి ప్రభావంతో వృత్తి పరంగా అత్యుత్తమ ఫలితాలు పొందుతారు. వ్యాపార నిమిత్తం దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణాలు ఆర్థికపరంగా కలిసి వస్తాయి. బుధుడు శుక్ర గ్రహాల సంచారం అదృష్టంగా ఉంటుంది. తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే లాభాలు పొందే అవకాశం ఉంది.

బుధుడు స్థానం బలపరిచేందుకు పరిహారాలు

మీ జాతకంలో బుధుడు స్థానం బలహీనంగా ఉంటే మీరు విధాన మూల మాలని ధరించాలి. లేదంటే రుద్రాక్ష మాలలో పచ్చరత్నం ఉంగరం వేసుకుంటే బుధుడు అనుగ్రహం పొందుతారు. విష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. బుధవారం వీలైతే ఉపవాసం ఉండండి.

శుక్ర గ్రహాన్ని బలోపేతం చేసే పరిహారాలు

జాతకంలో శుక్రుడు స్థానం బలపరిచేందుకు మీరు ఆరు ముఖ రుద్రాక్ష మాల ధరించాలి. ఇది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. లక్ష్మీదేవిని క్రమం తప్పకుండా పూజించాలి. శ్రీ సూక్తాన్ని పఠించాలి.