Mars transit: 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలో కుజుడి సంచారం.. ఈ రాశుల జాతకులకు బంపర్ బెనిఫిట్స్-after 30 years mars transit in saturn kumbha rashi these zodiac signs get bumper benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Transit: 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలో కుజుడి సంచారం.. ఈ రాశుల జాతకులకు బంపర్ బెనిఫిట్స్

Mars transit: 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలో కుజుడి సంచారం.. ఈ రాశుల జాతకులకు బంపర్ బెనిఫిట్స్

Gunti Soundarya HT Telugu
Feb 27, 2024 09:53 AM IST

Mars transit: సుమారు 30 సంవత్సరాల తర్వాత అంగారకుడు కుంభ రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ రాశిలో సూర్యుడు, బుధుడు, శని కూడా ఉన్నారు. కుజుడు సంచారంతో కొన్ని రాశుల వారిని అదృష్టం వరించనుంది.

కుంభ రాశిలో కుజ సంచారం
కుంభ రాశిలో కుజ సంచారం

Mars transit: గ్రహాల అధిపతులు ఇప్పటికే శని సొంత రాశి కుంభ రాశిలో కూర్చున్నారు. ఇప్పుడు మరొక గ్రహం కూడా కుంభ రాశిలోకి ప్రవేశించబోతుంది. త్వరలోనే అసురుల అధిపతి అంగారకుడు కూడా శని రాశిలో సంచరించబోతున్నాడు. మార్చి 15న కుజుడు మకర రాశి నుండి కుంభరాశి ప్రవేశం చేస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో అంగారక గ్రహం ధైర్యం, శక్తి, పోరాటానికి ప్రతీకగా భావిస్తారు.

30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో అంగారకుడు సంచారం జరుగుతుంది. కుంభ రాశిలో ఏప్రిల్ 22 వరకు కుజుడు సంచారం ఉంటుంది. శని రాశిలో కుజుడు సంచారం మొత్తం పన్నెండు రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభ రాశిలో కుజుడు సంచారం శుభప్రదంగా ఉండనుంది. దీని ఫలితంగా కొన్ని రోజులు వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగబోతున్నాయి.

మేష రాశి

మేష రాశి వారికి కుజ సంచారం శుభప్రదం కాబోతుంది. ఆకస్మిక ధనాన్ని పొందుతారు. ఫుల్ ఎనర్జీతో ముందుకు సాగుతారు. కెరీర్ లో ఒక లక్ష్యంతో ముందుకు సాగడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. కొత్త జాబ్ ఆఫర్ కూడా పొందుతారు. కుజుడు అనుగ్రహంతో ధన, ధాన్యం, భూమిపరంగా లాభాలు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కుజుడు సంచారం శుభాలను చేకూరుస్తుంది. కుజుడు ప్రభావం వల్ల అన్నిచోట్ల ధైర్యంగా ముందుంటారు. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. ఈ సమయంలో మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. నాయకత్వ లక్షణాలతో ధైర్యంగా ముందుకు సాగుతూ ఇతరుల మనసు గెలుచుకుంటారు.

సింహ రాశి

కుజుడు రాశి మార్పు సింహరాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తుంది. కెరీర్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. మీ దగ్గరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. కుటుంబం,స్నేహితులు అత్యవసర సమయంలో మీకు తోడుగా నిలుస్తారు. మీరు చేసే ప్రయాణాలు లాభాలు కలిగిస్తాయి. సమాజంలో మీ హోదా, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి కుజుడు ప్రభావంతో దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కుంభ రాశి

కుజుడు సంచరించబోయేది ఈ రాశిలోనే. ఫలితంగా కుంభ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది. జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో మీరు చూపించే ప్రతిభ పట్ల ఉన్నతాధికారులు సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా బలపడతారు.

కుంభ రాశిలో అంగారకుడు సంచారం వల్ల కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మిథునం, వృశ్చిక రాశుల వారికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడతారు. మిగతా రాశుల మీద అంగారకుడి ప్రభావంతో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డబ్బుకి సంబంధించి తీసుకునే నిర్ణయాలు పట్ల ఆచితూచి వ్యవహరించాలి.