ఫిబ్రవరి 27, నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల జాతకులకు ఆకస్మిక ధన నష్టం, ఆరోగ్య సమస్యలు-today dina phalalu february 27th tuesday check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Dina Phalalu February 27th Tuesday Check Your Zodiac Signs Result For Daily Horoscope

ఫిబ్రవరి 27, నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల జాతకులకు ఆకస్మిక ధన నష్టం, ఆరోగ్య సమస్యలు

HT Telugu Desk HT Telugu
Feb 27, 2024 12:05 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ27.02.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 27 నేటి రాశి ఫలాలు
ఫిబ్రవరి 27 నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 27.02.2024

ట్రెండింగ్ వార్తలు

వారం: మంగళవారం, తిథి : తదియ,

నక్షత్రం : హస్త, మాసం : మాఘం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయాలలో ప్రత్యేక శ్రద్ద వహించాలి. విదేశీయాన ప్రయత్నం ఫలిస్తుంది. సంతానపరంగా జాగ్రత్త హించడం మంచిది. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వరునికి దీపారాధన చేయండి. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం మంచిది.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్మరించుకుంటారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దుర్గాదేవిని పూజించటం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి చూడాలి. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడతారు. నూతనంగా చేసే పనులు ప్రారంభించకుంటే మంచిది. ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. సుబ్రహ్మణ్యుని ఆలయం దర్శించటం మంచిది. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో కలసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభముంటుంది. దైవదర్శనం చేసుకుంటారు. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. భక్తి శ్రద్దలు అధికమవుతాయి. ఆంజనేయ స్వామి వారిని పూజించండి. అప్పాలను ఆంజనేయస్వామికి నివేదించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. సోదర వైరం కలిగే అవకాశముంది. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. మీరు చేసే ప్రతి పనికి ఆటంకాలు ఎదురై ఇబ్బంది పడతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గా దేవిని పూజించాలి. సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని దర్శించడం మంచిది.

కన్యా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబముతో ఆనందంగా గడుపుతారు. గృహంలో జరిగే మార్పులు ఆనందాన్నిస్తాయి. బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు కలసి వస్తాయి. ధనధాన్యభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం మంచిది. రాహుకాల సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. వృథా ప్రయాణాలుంటాయి. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనుకోకుండా కుటుంబంలో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశముంది. అశుభవార్తలు వినాల్సి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడటం మంచిది. వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. గతంలో వాయిదా వేసిన పనులు పూర్తిచేస్తారు. కుటుంబముతో సంతోషంగా గడుపుతారు. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మానసిక ఆందోళన, కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. బంధుమిత్రులతో భేదాభిప్రాయములు రాకుండా జాగ్రత్త వహించాలి. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. గణపతి స్తోత్రం పఠించాలి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు వృత్తి ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలున్నాయి. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల వైపు నుంచి ధనలాభం ఉంటుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది. మానసిక ఆందోళన చెందుతారు. కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం వినాయకుడిని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం రుణవిమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel