ఆంజనేయ దండకం.. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం-anjaneya dandakam read hanuman dandakam here in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Anjaneya Dandakam.. Read Hanuman Dandakam Here In Telugu

ఆంజనేయ దండకం.. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

HT Telugu Desk HT Telugu
May 30, 2023 06:32 AM IST

ఆంజనేయ దండకంలో స్వామి వారి మహిమలు, లీలలు ఉన్నాయి. మీరు ఏ కష్టంలో ఉన్నా ఈ ఆంజనేయ దండకం పారాయణం చేస్తే మీ మనసు వెంటనే కుదుటపడుతుంది. స్వామి వారి అనుగ్రహం లభించి మీ కష్టాలు ఎదుర్కొనే ధైర్యం మీకు అవలీలగా వస్తుంది.

హనుమాన్ దండకం చదివితే కష్టాలు అవలీలగా దాటేస్తారు
హనుమాన్ దండకం చదివితే కష్టాలు అవలీలగా దాటేస్తారు

ఆంజనేయ దండకం ద్వారా స్వామి వారి మహిమలు, లీలలు ప్రతి మంగళవారం మీరు చదవగలిగితే ఏ కష్టంలో ఉన్నా మీకు తేలికగా అనిపిస్తుంది. స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. ఎంతటి కష్టాన్నైనా మీరు ఇట్టే దాటేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

హనుమాన్ దండకం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం

భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం

భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం

బటంచున్ ప్రభాతంబు సాయంత్రంబు

నీ నామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి

నీమీద నే దండకం బొక్కటింజేయ నూహించి

నీ మూర్తినిం గాంచి నీ సుందరం బెంచి

నీ దాసదాసుండనై రామభక్తుండనై

నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే

వేడుకల్ జేసితే నా మొరాలించితే

నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ

నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై చూచితే

దాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే

తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్థమై యేగి

శ్రీరామ సౌమిత్రులన్ జూచి వారిన్విచారించి

సర్వేశు పూజించి యబ్బానుజున్ బంటు గావించి

యవ్వాలినిన్ జంపి కాకుత్సతిలకున్ దయాదృష్టి వీక్షించి

కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్

లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియున్

భూమిజన్ జూచి యానందముప్పొంగ

యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి

శ్రీరామునకున్నిచ్చి సంతోషునిన్ జేసి

సుగ్రీవుడా యంగదా జాంబవంతాది వీరాదులన్ గూడి

యాసేతువున్ దాటి వానరల్మూకలై పెన్మూకలై

దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి

బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్ వేసి

యా లక్షణున్ మూర్ఛనొందింపగా నప్పుడే

నీవు సంజీవినిన్ దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా

కుంభకర్ణాదులన్వీరులన్ బోరి

శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా

నంత లోకంబులానందమై యుండ

నవ్వేళను విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి

పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవినిన్ దెచ్చి

శ్రీరాముకిన్నిచ్చి అయ్యోధ్యకున్ వచ్చి

పట్టాభిషేకంబు సంరంభమైయున్న

నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు

మన్నించినన్ శ్రీరామభక్తి ప్రశస్తంబుగా

నిన్ను సేవించి నీ నామకీర్తనల్ జేసితే

పాపముల్బాయునే భయములున్ దీరునే

భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్

సకల సంపత్తులున్ గల్గునే

వానరాకార యో భక్తమందార యో పుణ్యసంచార

యోధీర యో వీర నీవే సమస్తంబు నీవే

మహాఫలముగా వెలసి యా తారక బ్రహ్మ మంత్రంబు

సంధానమున్ జేయుచున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి

శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమైన

యెప్పుడున్ తప్పకన్ తలతు

నా జిహ్వయందుండియున్ దీర్ఘదేహంబు

త్రైలోక్య సంచారివై రామ నామాంకితధ్యానివై

బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్

రౌద్ర నీ జ్వాల కల్లోల హా వీరహనుమంత

ఓంకార శబ్దంబులన్ క్రూరసర్వగ్రహానీకమున్

భూత ప్రేతంబులన్ పిశాచ శాకినీ ఢాకినీ మోహినీ

గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి

నేలన్ బడన్ గొట్టి నీముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్

రోమఖండంబులన్ ద్రుంచి

కాలాగ్నిరుద్రుండవై బ్రహ్మప్రభాభాసితంబైన

నీదివ్య తేజంబునున్ జూచి

రారోరి నా ముద్దు నరసింహ యనుచున్

దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామి

యో ఆంజనేయా నమస్తే సదా బ్రహ్మచారీ

నమో వాయుపుత్రా నమస్తే నమస్తే నమః

WhatsApp channel

సంబంధిత కథనం