Jupiter transit: 12 ఏళ్ల తర్వాత వృషభ రాశిలోకి గురు గ్రహం.. ఈ రాశుల వారికి డబ్బుకి లోటు ఉండదు-after 12 years jupiter will enter taurus these zodiac signs will get lucky ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jupiter Transit: 12 ఏళ్ల తర్వాత వృషభ రాశిలోకి గురు గ్రహం.. ఈ రాశుల వారికి డబ్బుకి లోటు ఉండదు

Jupiter transit: 12 ఏళ్ల తర్వాత వృషభ రాశిలోకి గురు గ్రహం.. ఈ రాశుల వారికి డబ్బుకి లోటు ఉండదు

Gunti Soundarya HT Telugu
Jan 04, 2024 10:08 AM IST

Jupiter transit: బృహస్పతి శుభ స్థానం చాలా అదృష్టంగా భావిస్తారు. పన్నెండు సంవత్సరాల తర్వాత బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఫలితంగా ఈ రాశుల వాళ్ళు అదృష్టం పొందబోతున్నారు.

వృషభ రాశిలోకి రానున్న బృహస్పతి
వృషభ రాశిలోకి రానున్న బృహస్పతి

Jupiter transit: దేవగురువు బృహస్పతి. గ్రహాలు అన్నింటిలోకెల్లా అతిపెద్ద గ్రహం. సంతానం, సంపద, ఐశ్వర్యం, దానం, సద్గుణం, జ్ఞానం, విద్య వంటి వాటికి కారకుడిగా గురు గ్రహాన్ని భావిస్తారు. బృహస్పతి శుభ గ్రహంగా పేర్కొంటారు.

బృహస్పతి ఎప్పటికప్పుడు తన నడకని మారుస్తూ ఉంటాడు. జాతకంలో బృహస్పతి స్థానం శుభంగా ఉంటే చాలా అదృష్టంగా భావిస్తారు. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం జ్ఞానం, శ్రేయస్సు, గౌరవం, కీర్తి ప్రతిష్టలకి కారకుడిగా పరిగణించబడతాడు.

గురు గ్రహ శుభ సంచారం వల్ల ఒక వ్యక్తికి జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం మేష రాశిలో ఉన్న బృహస్పతి మే 1వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనస్సు, మీన రాశులకి అధిపతిగా వ్యవహరించే బృహస్పతి వృశ్చిక రాశిలోకి రావడం వల్ల కొన్ని రాశులకి అదృష్టం పట్టబోతుంది.

సింహ రాశి

కొన్ని సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి వచ్చిన గురుడు వల్ల సింహ రాశి వారికి చాలా ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఊహించని లాభాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులు విదేశీ ఒప్పందాలు పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న గొడవలు, ఇబ్బందులు క్రమంగా సమసిపోతాయి. బృహస్పతి శుభ ప్రభావంతో ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

కన్య రాశి

వృషభ రాశిలో బృహస్పతి ప్రవేశం కన్య రాశి వారికి మేలు చేస్తుంది. గతంలో నిలిచిపోయిన అనేక పనులు తిరిగి ప్రారంభించేందుకు ఇది అనువైన సమయం. కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందేందుకు మార్గాం సుగమం అవుతుంది. ఉద్యోగ రీత్యా విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీరు మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. ప్రేమతో నిండిన జీవితం మీ సొంతం అవుతుంది.

వృషభ రాశి

పన్నెండు సంవత్సరాల తర్వాత బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అందుకే డబ్బులు ఖర్చు పెట్టె ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కోరుకున్న కలలు నిజం చేసుకునేందుకు ఇది ఉత్తమమైన సమయం. ఈ సమయంలో మీరు ఏదైనా పని ప్రారంభిస్తే అది శుభప్రదంగా జరుగుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.

Whats_app_banner