Vrishabha Rasi 2024: వృషభ రాశి నూతన సంవత్సర రాశి ఫలాలు.. ఆరోగ్యం జాగ్రత్త-rasi phalalu 2024 vrishabha rasi check your taurus zodiac sign astrological prediction for new year in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vrishabha Rasi 2024: వృషభ రాశి నూతన సంవత్సర రాశి ఫలాలు.. ఆరోగ్యం జాగ్రత్త

Vrishabha Rasi 2024: వృషభ రాశి నూతన సంవత్సర రాశి ఫలాలు.. ఆరోగ్యం జాగ్రత్త

HT Telugu Desk HT Telugu

వృషభ రాశి జాతకులకు 2024వ సంవత్సరంలో రాశి ఫలాలు మధ్యస్థంగా ఉన్నాయని పంచాంగకర్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. ఈ జాతకుల కెరీర్, ఆరోగ్యం, ఆదాయం ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకోండి.

వృషభ రాశి జాతకులకు 2024వ సంవత్సరంలో రాశి ఫలాలు

2024వ సంవత్సరం వృషభ రాశి వారికి ఒత్తిళ్ళు అధికముగా ఉండేటటువంటి సంవత్సరమని, మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

2024వ సంవత్సరంలో దశమ స్థానములో శని ఉన్నందున వృషభ రాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములిచ్చును. ఏప్రిల్‌ వరకు గురుడు వ్యయస్థానములో సంచరించడం వల్ల ఖర్చుల ప్రభావం అధికముగా ఉండును.

మే నుండి జన్మ గురుని 'ప్రభావం చేత వృషభ రాశి వారికి పనుల యందు ఒత్తిళ్ళు, మానసిక వేదనలు, సమస్యలు, అరోగ్య సమస్యలు వంటివి ఇబ్బంది పెట్టేటువంటి స్ధితి గోచరిస్తుంది.

వృషభ రాశి ఉద్యోగులకు ఉద్యోగపరముగా ఈ సంవత్సరం కలసి వచ్చినప్పటికి ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఇబ్బందికి గురి చేయును. వ్యాపారస్తులకు 2024 మధ్యస్థ ఫలితాలను కలుగచేస్తాయి.

రైతాంగం, సినీరంగాల వారికి 2024 సంవత్సరం కలసివచ్చును. విద్యార్థులకు 2024 సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు 2024 సంవత్సరం అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంత వేధించును.

వృషభ రాశి 2024 ప్రేమ జీవితం

2024 సంవత్సరంలో వృషభ రాశి వారికి ప్రేమ జీవితం అంత అనుకూలంగా లేదు. చికాకులు, వాదనలు కలుగును. ఖర్చులు పెరుగును. ప్రేమ పరమైనటువంటి విషయాల్లో అనుకున్న విధముగా సాగేటటువంటి స్థితి గోచరించడం లేదు. వాదనలకు దూరంగా ఉండాలని సూచన. ప్రతీ విషయాన్ని హృదయంలోకి తీసుకోకూడని సూచిస్తున్నాను. పని ఒత్తిళ్ళు, కుటుంబ ఒత్తిళ్ళ వల్ల ప్రేమ జీవితం మీద ప్రభావం కలిగించును. ప్రతీ ఒక్కరిని గుడ్డిగా నమ్మవద్దు.

వృషభ రాశి 2024 ఆర్థిక విషయాలు

ఆర్ధికపరముగా 2024 వృషభ రాశి వారికి కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి సమయం. ఈ సంవత్సరం ఖర్చులు అధికమగును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. వ్యాపారస్తులకు ధనపరమైన సమస్యలు ఏర్పడును. రావలసిన సమయానికి రాలేకపోవడం సంభవిస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత అప్పులు చేయడం వల్ల ఇబ్బంది పెట్టు సూచనలున్నాయి. ఆర్థికపరంగా మధ్యస్థ ఫలితాలు కలిగించేటటువంటి సంవత్సరం అని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

వృషభ రాశి 2024 కెరీర్

వృషభ రాశి వారికి 2024 దశమ స్థానములో శని అనుకూలత వలన కెరీర్ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవును. జన్మ గురుని ప్రభావంచేత ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఇబ్బంది పెట్టును. 2024 సంవత్సరం వృషభరాశికి కెరీర్ పరంగా కొంత అనుకూలత ఉన్నప్పటికి పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు కొంత ఇబ్బందిపెట్టును.

వృషభ రాశి 2024 ఆరోగ్యం

2024 వృషభరాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం మొదటి 4 నెలలు వ్యయస్థానములో గురుడు, తరువాత 8 నెలలు జన్మ గురుని ప్రభావం చేత వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. ముఖ్యంగా 2024 ద్వితీయార్థములో వృషభ రాశి వారు ఆరోగ్య విషయాలలో కచ్చితమైనటువంటి శ్రద్ధ వహించాలి. వృషభ రాశి వారు అనారోగ్య సమస్యలు తొలగించుకోవడానికి గురు దక్షిణామూర్తి ని పూజించడం మంచిది. జన్మగురుని ప్రభావంచేత మానసిక ఒత్తిళ్ళు, అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం వేధించును. చిలకమర్తి పంచాంగరీత్యా 2024 సంవత్సరం వృషభరాశివారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు.

వృషభ రాశి 2024 పరిహారాలు

వృషభ రాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దక్షిణామూర్తిని పూజించాలి. గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల గ్రహదోష నివృత్తి జరుగుతుంది. ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

సంబంధిత కథనం