Ugadi 2023 Vrishabha Rasi Phalalu: శోభకృత్ నామ సంవత్సరం వృషభ రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నాయి.,వృషభ రాశి వారి ఆదాయం- 14, వ్యయం- 11, రాజపూజ్యం- 6 అవమానం- 1,శ్రీ శోభకృత్ నామ సంవత్సరం వృషభరాశి వారికి ఫలితాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నందు వృషభరాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా బృహస్పతి వ్యయ స్థానమునందు సంచరించుటచేత, శని దశమ స్థానము నందు సంచరించుటచేత, రాహువు వ్యయ స్థానము యందు సంచరించుటచేత మరియు కేతువు 6వ స్థానమునందు సంచరించుటచేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూలమైనటువంటి ఫలితములు ఉన్నవి.,వృషభరాశి వారికి రాహువు, కేతువు యొక్క ప్రభావం చేత ఈ సంవత్సరం అనుకోని మరియు ఆకస్మిక ఖర్చులు ఉంటాయి. వ్యయస్థానములో గురు రాహువులు సంచరించుట వలన ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యమునకు సంబంధించిన వ్యవహారాల్లో ఖర్చులు పెరుగును. వృషభరాశి వారికి ఈ సంవత్సరం శని రాజ్య స్థానము నందు సంచరించుట వల్ల ఆర్థికపరంగా, వృత్తిపరంగా మరియు వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. వృషభరాశి వారికి ఆరో స్థానములో కేతువు అనుకూల స్థితి వలన అనుకూలమైన మరియు శుభఫలితాలు ఏర్పడబోతున్నాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.,వృషభ రాశి ఉద్యోగులకు ఉగాది రాశి ఫలాలుశ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృషభరాశి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగస్తులకు ఉద్యోగము నందు ప్రమోషన్లు , ధనలాభము మరియు కీర్తి లాభము కలుగును. వృషభరాశి వ్యాపారస్తులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. వ్యయస్థానముపై గురు, రాహు ప్రభావం చేత అప్పులు, ఖర్చులు కొంచెం అధికమగును. వ్యాపారస్తులు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన.,వృషభరాశి స్త్రీలకు ఈ సంవత్సరం మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిళ్ళు మరియు కుటుంబ సమస్యలు వేధించును. ఆరోగ్యమునకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. వృషభరాశి విద్యార్థులకు అనుకూలమైన సంవత్సరం. విదేశీయోగం కలిసివచ్చును. వృషభ రాశి రైతులకు ఈ సంవత్సరం మధ్యస్త ఫలితాలు ఉండును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది.,పరిహారం ఇలా..మొత్తం మీద వృషభరాశి వారికి శ్రీ శోభకృత్ సంవత్సరం ధన, వృత్తి, వ్యాపారపరంగా అనుకూలం. ఆరోగ్య రాజకీయ కుటుంబ వ్యవహారాల పరంగా ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశివారు ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం, శనివారం దుర్గాదేవిని మరియు గురువారం దక్షిణామూర్తిని పూజించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.,వృషభ రాశి మాస వారి ఫలాలుఏప్రిల్: ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ఈ రాశివారికి జన్మరాశిలో శుక్ర సంచారం ప్రభావం అనుకూలం. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. ధన సంపాదన, భూయోగం కలుగుతుంది.,మే:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ఆకస్మిక ధనలాభము కార్యజయము సర్వత్రా అనుకూలత. క్రోధము వలన పనులు చెడుతాయి. ప్రయాణములు కలసివస్తాయి. వ్యాపార వాటాలలో పెట్టుబడులు కలసి వస్తాయి. గుండె సంబంధ విషయాలలో వైద్య సలహాలు అవసరం. ,జూన్ : ఈ మాసం మీకు మధ్యస్తముగా ఉన్నది. జీవితంలో కొత్త దృక్పథాన్ని అలవరచుకుని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తారు. సోదరులు కుటుంబ సభ్యులు మీకు సహకారాన్ని అందిస్తారు. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం. అనారోగ్య సమస్యలు మటుమాయం. ,జూలై : - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సోమరితనం వలన కార్యభారము పని ఒత్తిడి అధికమయ్యే అవకాశం. స్నేహితులు మీ మాటలకు ఎక్కువ విలువనిస్తారు. సంతానం వృద్ధిలోకి వస్తారు.,ఆగస్టు: - ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మీ తోటివారితో విభేదాలు. మాతృమూలక అనారోగ్యములు లేదా కలహములకు దారి తీయవచ్చు. ప్రస్తుతానికి వ్యాపార లావాదేవీలు పనికిరావు. మానసిక పరమైన ఒత్తిడి భూమి లేదా ఆస్తి కొనుగోలు విషయంలో ఇబ్బందులు. ,సెప్టెంబర్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. శుభవార్తలు వింటారు. సామాజిక జీవనం గౌరవప్రదంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వం నుండి గౌరవము దక్కుతుంది. శతృజయం, మిత్రలాభం, స్నేహితుల వలన ధనయోగం. ,అక్టోబర్:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. మీ ఆదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కనబడుతుంది. శత్రువులను జయించటానికి వ్యూహాలు రచిస్తారు. మంచి స్నేహితులతో ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ,నవంబర్ :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. గృహయోగం కలుగుతుంది. మాసారంభంలో చంద్రుడు జన్మరాశిలో యుండుట వలన గృహ అలంకరణ వస్తువులు, వస్త్రలాభములు, ప్రేమవ్యవహారాలకు దారితీసే అవకాశము. ఇసుక, మైనింగ్ వ్యాపారములు కలసివస్తాయి.,డిసెంబర్ : - మాతృ, కళత్ర సంబంధ కలహములు, ఉదర, జననాంగ సంబంధ అనారోగ్య సూచనలు. ఉద్యోగములో క్రోథము వీడిన పై అధికారులతో ఇబ్బందులు తొలగుతాయి. దోష నివారణకు సుబ్రహ్మణ్య, సూర్య ఆరాధన మంచిది.,జనవరి : – ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. రక్తప్రసరణ, అజీర్ణం, మూలవ్యాధుల సమస్యలు రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అనవసర ఖర్చులకు పోయి నష్టపోకుండా జాగ్రత్త అవసరం. అప్పుల బారినపడకుండా జాగ్రత్తపడాలి.,ఫిబ్రవరి :- ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. దూర ప్రయాణములు వాయిదా వేయుట మంచిది. కుటుంబ సభ్యులతో గడపడం వలన మనశ్శాంతి. ఉద్యోగం ఆశించేవారికి తక్షణమే అనుకూలం.,మార్చి :- ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. లాభస్థానమందు సకల దోషాలు తొలగి ఆర్థిక పరిపుష్టి, ఉద్యోగ విజయము. ఆకస్మిక ధనలాభము, విందు వినోదాలలో ఆనందాన్ని అనుభవిస్తారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగుతాయి. ఇతర దేశాలకు వెళ్ళే అవకాశము ఉంది.,,