ఏ దేశానికైనా దేశ రక్షణ అత్యంత కీలకం. అందుకే బడ్జెట్ లో ఏ దేశమైనా రక్షణ రంగానికి అధిక కేటాయింపులు చేస్తుంటుంది. ప్రతీ ఏటా ఆ కేటాయింపులు పెరుగుతూనే ఉంటాయి. భారత్ లో స్టాక్ మార్కెట్లో ఉన్న రక్షణ రంగ స్టాక్స్ పై ప్రముఖ వెల్త్ మేనేజ్ మెంట్ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICIDirect) కొన్ని సిఫారసులు చేసింది.
ప్రముఖ వెల్త్ మేనేజ్ మెంట్ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICIDirect) సిఫారసుల ప్రకారం.. డిఫెన్స్ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్ఏఎల్ (Hindustan Aeronautics Ltd HAL), బీడీఎల్ (Bharat Dynamics Ltd BDL), బీఈఎల్ (Bharat Electronics Ltd (BEL) లను ఎంచుకోవచ్చిన ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICIDirect) సూచిస్తోంది. రానున్న నాలుగు, ఐదు సంవత్సరాల్లో భారత రక్షణ రంగ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని, అందువల్ల, ఈ మేరకు ఈ స్టాక్స్ లాభపడ్తాయని ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICIDirect) అంచనా వేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థల చేతిలో భారీ ఆర్డర్లు ఉన్నాయని చెబుతోంది.
వీటిలో హెచ్ఏఎల్ (HAL) ఆదాయం 10.3%, సీఏజీఆర్ (CAGR) 14.8%, గా ఉన్నాయి. రానున్న సంవత్సరాల్లో అవి మరింత వృద్ది చెందే అవకాశముంది. ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్ రూ. 3300 నుంచి రూ. 3500 గా ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICIDirect) అంచనా వేస్తోంది. బీఈఎల్ (BEL) చేతిలో భారీ, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థ కూడా రానున్న ఒకటి, రెండు ఏళ్లలో మంచి వృద్ధిని సాధించే అవకాశం ఉంది. ఈ బీఈఎల్ (BEL) టార్గెట్ ప్రైస్ ను రూ. 130గా ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICIDirect) అంచనా వేస్తోంది. ప్రభుత్వ రంగంలోని మరో డిఫెన్స్ కంపెనీ బీడీఎల్ (BDL). ఈ సంస్థ రానున్న కనీసం రెండు ఆర్థిక సంవత్సరాల్లో 20.4% ఆదాయ వృద్ధిని, 19.9% సీఏజీఆర్ (CAGR)ను సాధించే అవకాశముంది. బీడీఎల్ (BDL) టార్గెట్ ప్రైస్ ను రూ. 1,215గా ఐసీఐసీఐ డెరెక్ట్ అంచనా వేస్తోంది. ఇవే కాకుండా, మాజగావ్ డాక్ (Mazagon Dock) షేర్లను కూడా బై (BUY) కేటగిరీలోకి చేర్చింది. ఈ షేర్ల టార్గెట్ ప్రైస్ ను రూ. 745గా పేర్కొంది. డేటా ప్యాటర్న్స్ (Data Patterns), కొచిన్ షిప్ యార్డ్ (Cochin Shipyard)ల స్టాక్స్ పై కూడా ఐసీఐసీఐ డైరెక్ట్ సానుకూలంగా స్పందించింది. డేటా ప్యాటర్న్స్ (Data Patterns) టార్గెట్ ప్రైస్ ను రూ1,670 గా, కొచిన్ షిప్ యార్డ్ (Cochin Shipyard) టార్గెట్ ప్రైస్ ను రూ. 620 గా నిర్ధారించింది.
సూచన: పైన పేర్కొన్న అభిప్రాయాలు, సూచనలు సంబంధిత సంస్థలు, నిపుణులు ఇచ్చినవి.