Dividend stocks: ఎఫ్ డీ, పీపీఎఫ్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చే డివిడెండ్ స్టాక్స్-dividend stocks dividend yield of these 5 shares beat ppf bank fd returns in fy23 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Dividend Stocks: ఎఫ్ డీ, పీపీఎఫ్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చే డివిడెండ్ స్టాక్స్

Dividend stocks: ఎఫ్ డీ, పీపీఎఫ్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చే డివిడెండ్ స్టాక్స్

HT Telugu Desk HT Telugu
Apr 01, 2023 04:39 PM IST

ఏటా డివిడెండ్ల (Dividend) రూపంలో పెద్ద మొత్తాన్ని ఇచ్చే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం కోసం చూస్తున్నారా? ఈ ఐదు కంపెనీలను ఒక సారి పరిశీలించండి..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈపీఎఫ్ (EPF), పీపీఎఫ్ (PPF), ఎఫ్ డీ (FD) లు ఇచ్చే వడ్డీ కన్నా ఎక్కువ మొత్తం డివిడెండ్ (Dividend) రూపంలో ఇచ్చే కంపెనీలు కొన్ని ఉన్నాయి. అయితే, (EPF), పీపీఎఫ్ (PPF), ఎఫ్ డీ (FD) లు రిస్క్ లేని పెట్టుబడులు కాగా, స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం కొంతవరకు రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అయితే, కొంత రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడిన వారు మంచి డివిడెండ్ (Dividend) ఇచ్చే ఈ కంపెనీల్లో షేర్ల కొనుగోలు విషయాన్ని పరిశీలించవచ్చు. ఈ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం (FY23)లో గరిష్టంగా 29% వరకు డివిడెండ్ గా ఇచ్చాయి.

Vedanta: వేదాంత లిమిటెడ్

మైనింగ్ బిజినెస్ లో ఉన్న ప్రముఖ సంస్థ వేదాంత లిమిటెడ్ 2001 జులై నుంచి ఇప్పటివరకు మొత్తం 39 సార్లు డివిడెండ్ల (Dividends)ను ప్రకటించింది. గత 12 నెలల్లో ఈ కంపెనీ తమ షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ కు రూ. 81 లను డివిడెండ్ (Dividend) గా అందించింది. ప్రస్తుతం వేదాంత లిమిటెడ్ షేర్ విలువ రూ. 274.45 గా ఉంది.

Hindustan Zinc: హిందుస్తాన్ జింక్ లిమిటెడ్

హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ (Hindustan Zinc) కూడా జూన్ 2001 నుంచి 39 సార్లు తమ మదుపర్లకు డివిడెండ్ (Dividend) ప్రకటించింది. గత 12 నెలల్లో హిందుస్తాన్ జింక్ లిమిటెడ్ తమ షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 75.50 లను డివిడెండ్ (Dividend) గా అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ విలువ రూ. 293.35గా ఉంది.

Coal India: కోల్ ఇండియా

ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా (Coal India) 2011 నుంచి ఇప్పటివరకు మొత్తం 23 డివిడెండ్ల (Dividends) ను ప్రకటించింది. గత 12 నెలల్లో, అంటే 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో తమ మదుపర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై కోల్ ఇండియా రూ. 23.25 లను డివిడెండ్ (Dividend) గా అందించింది. ప్రస్తుతం కోల్ ఇండియా షేర్ మార్కెట్ వాల్యూ రూ. 213.65 గా ఉంది.

REC Ltd: ఆర్ఈసీ లిమిటెడ్

విద్యుత్ రంగ కార్యకలాపాల్లో మార్కెట్ లీడర్ గా ఆర్ఈసీ లిమిటెడ్ (REC Ltd) ఉంది. 2008 నుంచి ఈ సంస్థ మొత్తం 32 డివిడెండ్లను ప్రకటించింది. గత 12 నెలల్లో, అంటే 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో తమ మదుపర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై ఆర్ఈసీ లిమిటెడ్ (REC Ltd) రూ. 13.05 లను డివిడెండ్ (Dividend) గా అందించింది. ప్రస్తుతం ఆర్ఈసీ లిమిటెడ్ (REC Ltd) షేర్ మార్కెట్ వాల్యూ రూ.115.45 గా ఉంది.

ONGC: ఓ ఎన్ జీ సీ

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) లిమిటెడ్ కూడా మదుపర్లకు మంచి డివిడెండ్ల (Dividends) ను అందించే కంపెనీల్లో ఒకటి. ఈ సంస్థ షేర్ హోల్డర్లకు 2000 ఆగస్ట్ నుంచి మొత్తం 54 డివిడెండ్లను (ONGC) ప్రకటించింది. గత 12 నెలల్లో, అంటే 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో తమ మదుపర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) లిమిటెడ్ రూ. 14.00 లను డివిడెండ్ (Dividend) గా అందించింది. ప్రస్తుతం ONGC షేర్ మార్కెట్ వాల్యూ రూ.151.05 గా ఉంది.

సూచన: షేర్ మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. పూర్తి పరిశోధన అనంతరం స్వీయ నిర్ణయం సముచితం.

Whats_app_banner