Vedanta dividend: మరో డివిడెండ్ ప్రకటించిన వేదాంత; ఇదీ కూడా భారీ మొత్తమే..
Vedanta dividend: భారీ మొత్తాల్లో డివిడెండ్ ప్రకటించే కంపెనీల్లో ఒకటైన వేదాంత లిమిటెడ్ మరోసారి తమ షేర్ హోల్డర్లకు శుభవార్త తెలిపింది.
Vedanta dividend: వేదాంత లిమిటెడ్ (Vedanta Ltd) మైనింగ్ మొఘల్ గా పేరొందిన అనిల్ అగర్వాల్ (Anil Agarwal) కు చెందినది. తాజాగా, ఈ కంపెనీ తమ మదుపర్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదో మధ్యంతర డివిడెండ్ (interim dividend) ను ప్రకటించింది.

Vedanta dividend: రూ. 20.50 డివిడెండ్
ఈ ఆర్థిక సంవత్సరం (financial year 2022-23) లో వేదాంత లిమిటెడ్ (Vedanta Ltd) ఐదో మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించింది. రూ. 1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై ఐదో మధ్యంతర డివిడెండ్ (interim dividend) గా రూ. 20.50 ఇవ్వాలని నిర్ణయించింది. డివిడెండ్ చెల్లింపునకు ఏప్రిల్ 7వ తేదీని రికార్డు డేట్ గా ప్రకటించారు. ఈ డివిడెండ్ తో మొత్తం రూ. 7,621 కోట్ల భారం కంపెనీపై పడనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నాలుగు మధ్యంతర డివిడెండ్లను (interim dividend) ప్రకటించిన వేదాంత లిమిటెడ్ (Vedanta Ltd), ఇప్పటివరకు షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై మొత్తంగా రూ. 81 డివిడెండ్ గా అందించింది.
Vedanta dividend: మొత్తం రూ. 101.50
గత నాలుగు డివిడెండ్లలో ఒక్కో ఈక్విటీ షేర్ (equity share) పై మొత్తంగా రూ. 81 లను వేదాంత లిమిటెడ్ (Vedanta Ltd) తమ షేర్ హోల్డర్లకు అందించింది. ఈ సంవత్సరం జనవరిలో నాలుగో మధ్యంతర డివిడెండ్ (interim dividend) గా రూ. 12.50 ని, గత సంవత్సరం నవంబర్ లో మూడో మధ్యంతర డివిడెండ్ (interim dividend) గా రూ. 17.50 ని సంస్థ అందించింది. అలాగే, గత సంవత్సరం జులైలో రెండో మధ్యంతర డివిడెండ్ గా రూ. 19.50 ని, గత సంవత్సరం జులైలో మొదటి మధ్యంతర డివిడెండ్ (interim dividend) గా రూ. 31.50 ని అందించింది. అంటే, నాలుగు డివిడెండ్ల పేరుతో షేర్ హోల్డర్లు ఒక్కో ఈక్విటీ షేర్ పై మొత్తంగా రూ. 81 లను పొందారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన రూ. 20.50 తో కలుపుకుని అది రూ. 101.50 కి చేరింది. మార్చి 28న వేదాంత లిమిటెడ్ (Vedanta Ltd) షేర్ విలువ 1.01% పెరిగి 275.50 కి చేరింది.
టాపిక్